header

Srisailam Temple…శ్రీ శైలం దేవాలయం..

Srisailam Temple…శ్రీ శైలం దేవాలయం..

ఈ మహాక్షేత్రం భరద్వాజ, పరాశర మహర్షుల తపోవనాaతోనూ, చంద్రగుండం, సూర్యగుండం పుష్కరిణులతోనూ, అనంతమైన ఓషది మొక్కలతోనూ విరాజిల్లే ఈ క్షేత్రాన్ని ఏటాల క్షలాది భక్తులు సందర్శిస్తుంటారు. కృష్ణానది బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని పిలిచే మూడు పర్వత పాదాలను తాకుతూ ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత శోభను తెస్తుంది.
ఈ మహాక్షేత్రానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పున త్రిపురాంతకం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణంలో సిద్ధపటం ద్వారాలు
. ఆలయం వెలుపల పాండవప్రతిష్ట శివలింగాలను, వీరభద్రస్వామిని దర్శించుకోవచ్చు. మల్లిఖార్జున స్వామి గర్భాలయానికి ఆనుకుని ఉన్న గుండాన్ని బ్రహ్మగుండం అనీ, సప్తమాతృకలకు ఆనుకుని ఉన్నదాన్ని విష్ణుగుండం అని అంటారు. రంగమండపంలోస్వామి భక్తులైన హేమారెడ్డి మల్లమ్మ, అక్కమహాదేవి విగ్రహాలను దర్శించవచ్చు.
వీరభద్ర ఆలయానికి తూర్పుభాగంలో మల్లికా గుండం ఉంది. దీనికి పైభాగంలో మండపం ఉన్నప్పటికీ గుండంలో స్వామి ఆలయ శిఖరం కనిపిస్తుంది. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి వాడతారు. ఆలయంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిలోనీ నీరుఈ గుండంంలోకి చేరుతూ నిరంతరం ఒకే స్థాయిలో ఉంటుంది.
భ్రమరాంబికాదేవి : అష్టాదశ శక్తిపీఠంలో మహిమాన్వితమైనది భ్రమరాంబికా శక్తి పీఠమే అంటారు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో వామాచార సంప్రదాయం ఉండేదట. శంకరాచార్యుల అమ్మవారి ఎదురుగా శ్రీచక్రాన్ని స్థాపించి దక్షిణాచార సంప్రదాయాన్ని ప్రారంభించారు.
ఆదిశక్తి భ్రమరాంబికా దేవిగా ఈ ఆలయంలో వెలసింది. ఇందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనుక ఉన్న గోడ నుండి భ్రమర ఝుంకారం వినిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో లోపాముద్ర విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాల్లో ఉంది.
ఆలయం బయట శంకరమఠం, అమం వీరేశ్వారాయం, గంగాధర మండపం, శృంగేరీ శారదా మఠం, నందు మఠం, మ్లమ్మ కన్నీరు, గిరిజాశంకరుడు, వరాహతీర్థం, పశుపతినాథ లింగం, గోగర్భం, బయలు వీరభద్రుని దర్శించుకోవచ్చు.
ఇక్కడే ఉన్న చుక్కల పర్వతానికి 16 కి.మీ. దూరంలో ఉన్న అక్కమహాదేవి గుహకు నదీమార్గం ద్వారా వెళ్ళవచ్చు.
సాక్షి గణపతి : ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు ఈ గణపతి సాక్ష్యం చెబుతాడు. అందుకే ఇక్కడ గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా తమ గోత్రనామాలను చెప్పుకుంటారు.
పాలధార, పంచధారలు: ఇక్కడ కొండలోయ చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. లోయలోకి దిగటానికి మొట్లు అనుకూలంగా ఉంటాయి. మెట్లు దిగగానే ఎడమప్రక్క ఒకచోటనుండి పాలధార, ప్రక్కనే ఐదు నీటిధారలు ఉన్నాయి. మొదటిది శివుని ఫాలభాగం నుంచి ఉద్భవించిందనీ మిగిలిన ఐదూ శివుని పంచముఖాల నుంచి ఉద్భవించినవనీ చెబుతారు. పాలధార తెల్లగాను, పంచదార తియ్యగాను ఉంటాయి. ఈ నీటిని చాలామంది ఔషధంలా వాడుకుంటారు. ఈ నీటిధారలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి.
హటకేశ్వరం : ఇది పాలధార, పంఛదారలకు కేవలం యాభై అడుగుల దూరంలో ఉంటుంది. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో (కుండ పెంకులో) బంగారు లింగరూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరం.
నాగావళి తోట :నాగావళి తోటలో శివభక్తురాలు చంద్రావతి మల్లికార్జునుడికి మల్లెమాల వేస్తున్న దృశ్యం, బ్రమరాంబికాదేవి ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదిస్తున్న దృశ్యాలను చూడవచ్చు.
ఇతర వివరములకు సంప్రదించవలసిన చిరునామా
Executive Officer
Srisaila Devasthanam
Srisailam 518101
Phone: 08524 - 288883,288885,288886,288887,288888.
E-mail: eo@srisailamtemple.com
for Devastanam website click here