శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ నెల్లూరు : నెల్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో పెన్నా నదీతీరంలో ఉన్నది. నెల్లూరు బస్‌స్టేషన్ నుండి మరియు రైల్వేస్టేషన్ నుండి ప్రయాణ సదుపాయం కదు (12 కి.మీ) కామాక్షి మాతను శక్తి అవతారంగా చెబుతారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే ఈ క్షేత్రమందు శ్రీచక్రం ప్రతిష్టించ బడినది.
మహాముని కశ్యప మహర్షి యజ్ఞం చేసిన పవిత్ర ప్రదేశం కనుక జొన్నవాడ యజ్ఞవాటికగా కూడా పిుస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో (మే-జూన్) జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు.
యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం మరియు తిరుపతి దేవస్థానం వారివి వసతి గృహాలు కలవు. ప్రైవేటు వారి వసతి గృహాలలో కూడా బసచేయవచ్చు.
ఎలా వెళ్లాలి ? నెల్లూరు పట్టణానికి రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. నెల్లూరు పట్టణంలో అందరికీ అందుబాటులో హోటల్స్ కలవు.