పురాతనమైన పుణ్యక్షేత్రం పెంచలకోన. హిరణ్యకశిపుని వధ అనంతరం నరసింహస్వామి పెంచలకోనలో స్నానమాచరించి నరసింహావతారంను సమాప్తి చేసినట్లు స్థలపురాణం. స్వామి వారి విగ్రహం రెండు గండశిలలు పెనవేసుకున్నట్లు ఉంటుంది. నవనారసింహులో ఒకరైన సోమశిల నరసింహునిగా స్వామివారు ప్రసిద్ధి. కణ్య మహర్షి ఇక్కడ నివసించాడని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ ప్రవహించే కళ్యాణ నది కాలక్రమంలో కండలేరుగా ప్రసిద్ధి గాంచినది.
ప్రతి సంవత్సరం (వైశాఖ మాసం) వైశాఖ శుద్ధ ద్వాదశినుండి 5 రోజుల పాటు నరసింహ జయంతిని ఘనంగా జరుపుతారు. ఇక్కడ బస చేయుటకు దేవస్థానంవారి విశ్రాంతి గదులు, కాటేజ్ లు కలవు.
ఎలా వెళ్లాలి...? ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నెల్లూరు పట్టణానికి 80 కి.మీ. రావూరి నుండి 30 కి.మీ. దూరంలో రావూరి మండలంలో మెలగొండల్లో కలదు. నెల్లూరు పట్టణం నుండి ఈ ఆలయానికి బస్సులలో వెళ్లవచ్చు.