ప్రస్తుతం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి నిర్వహణలో ఉన్న ఈ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి.
సత్రాజిత్తు దగ్గర ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణడు దొంగిలించాడని నింద రాగా దానిని తొలగించుకొనుటకు శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం గాలిస్తుంగా ఓ గుహలో ఓ ఎలుగుబంటి (జాంబవతుడు) దగ్గర ఆ మణి ఉండటం చూస్తాడు. మణికోసం జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేయవలసి వస్తుంది. చివరకు జాంబవంతుడు శ్రీకృష్ణుని శ్రీరాముడిగా గుర్తించి శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేస్తాడు. సాక్షాత్తు జాంబవంతుడే ఇక్కడ మూలవిరాట్టును ప్రతిష్టించాడని చెబుతారు. జాంబవంతుడే ఇక్కడి క్షేత్రపాలకుడు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రప్రసక్తి ఉంది.
ఈ ఆలయాన్ని 10వ శతాబ్ధంలో చోళరాజులు నిర్మించారు. మనుమసిద్ధి, వెంకటగిరి రాజుల కాలంలో ఈ ఆలయం వైభవోపేతంగా ఉంది.
ద్వారపాలకులైన జయవిజయులతో పాటు విష్యక్సేన, సురగీవు బొమ్మలు, రావణుడు నరకడం వల్ల ఒక్క రెక్క ఉన్న జాటాయువు, శ్రీనివాస మూర్తులను ఇక్కడ చూడవచ్చు. ఆలయంలో 9.50 అడుగుల ఎత్తున్న గరుడ విగ్రహం, జాంబవంతుని విగ్రహం చూడముచ్చటగా ఉంటాయి. ఆలయం గోపురం మీద తిరుమల గోపురంలాగా సింహాల బొమ్మలు ఉంటాయి.