600 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం నెల్లూరు పట్టణం రంగనాయకుల పేటలో పెన్నానదీ తీరంలో ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి దగ్గరలో (నడచి వెళ్ళవచ్చు) కలదు. బస్ స్టేషన్ నుండి 5 కి.మీ. దూరంలో ఉన్నది. 29 మీటర్ల ఎత్తు ఉన్న గాలిగోపురంతో తొమ్మిది బంగారు కలశాలతో అలరారుచున్నది. ప్రతి సంవత్సరం స్వామి వారికి రథయాత్ర మరియు బ్రహ్మోత్పవాలు (మార్చి-ఏప్రియల్) నెలలో జరుగును.
కశ్వప మహర్షి ఇక్కడ పెన్నా నదీతీరంలో యజ్ఞం నిర్వహించి స్వామివారిని ప్రతిష్టించాడని స్థలపురాణం.పల్లవ చక్రవర్తి రాజరాజనరేంద్రుడు మరియు 13వ శతాబ్ధానికి చెందిన జాతవర్మ స్వామివారికి అమ్యూలమైన రత్నాభరణాలు సమర్పించారు. శ్రీ కవిబ్రహ్మ తిక్కన మహాభారతంలోని విరాట్‌పర్వం పెన్నానదీ తీరంలోనే తెనుగించాడని అంటారు. ఇంకా ఈ దేవాలయంలో అండాల్ అమ్మవారిని, ఆంజనేయస్వామి వారిని, వినాయకుని దర్శించవచ్చు.