header

Bhairavakona / భైరవకోన శివాలయం

Bhairavakona / భైరవకోన శివాలయం
Bhairavakona /  భైరవకోన శివాలయం భైరవకోనలోని రుద్రాలయానికి బ్రహ్మ, విష్ణువులు ద్వారపాలకులు. ఒకే గుహను తొలిచి నిర్మించిన ఎనిమిది ఆలయాలు ఇవి. ప్రధాన శివాలయం ద్వారపాలకులుగా బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు ఉండటం ఒక అద్భుతం.
నాలుగు భుజాలతో అంతటా కనిపించే విష్ణుమూర్తి విగ్రహం.. ఇక్కడ ఎనిమిది భుజాలతో దర్శనమిస్తుంది. ఇక్కడి దుర్గాదేవి ఆలయంలో ముగ్గురమ్మల ముఖాలతో వెలసిన మూలపుటమ్మ విగ్రహం ఉంది. లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ దేవి రూపాలు కలిసి ఉండటం చాలా అరుదు. కుడివైపు, ఎడమవైపు తొండం ఉన్న వినాయక విగ్రహాలు ఇక్కడ మరో విశేషం.
ఆలయ విశేషాలు....
క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో మలచిన ఈ గుహలు.. అపురూప శిల్పసంపదతో చూపరులకు కనువిందు చేస్తాయి. ఆలయాల సమీపంలో ఉన్న జలపాతం మనోహరంగా ఉంటుంది. ఈ జలపాతం నీళ్లు త్రిముఖ దుర్గాదేవి విగ్రహం ముందు ప్రవహిస్తూ ఒక గుండంగా మారతాయి. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఈ గుండంపై ప్రసరించిన చంద్రకిరణాలు దుర్గాదేవి ముఖంపై ప్రతిఫలించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం మరో విశేషం.
ఎలా వెళ్లాలి....
ప్రకాశం జిల్లా సీయస్పురం మండలం అంబవరం-కొత్తపల్లి గ్రామ సమీపంలో ఉంటుంది భైరవకోన.
ఒంగోలు నుంచి భైరవకోన 124 కిలోమీటర్లు. ఒంగోలు నుంచి పామూరుకు వెళ్లి, సీయస్పురం మీదుగా భైరవకోన వెళ్లవచ్చు. కనిగిరి నుంచి 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీయస్పురం నుంచి భైరవకోనకు ఆటోలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో ఉచిత భోజన సౌకర్యం ఉంది.