శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. క్రీ॥ 1443లో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. స్వామి వారు అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక్కడ భవనాశనీ తటాకాన్ని చూడవచ్చు. ప్రతి శని, ఆది, మంగళవారాలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి మొదలు బహుళ పాడ్యమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. ఇక్కడే కొండ మీద శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా కలదు.
స్థల చరిత్ర : శ్రీలక్ష్మీనరసింహదేవస్ధానం మరియు ప్రసన్నాంజనేయ దేవస్థానానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కధనం. 14వ శతాబ్ధంలో దేవరాయలచే ఈ ఆలయం కట్టించబడినదని అంటారు. 14వ శతాబ్ధంలో సింగరకొండకు దగ్గరలో ఉన్న పల్లెలో నరసింహస్వామి భక్తుడయిన సింగన్న అనే అతను నివసిస్తూ ఉండేవాడు.
అతని కుమార్తె నరసమ్మ తమ ఆవులను మేపేందుకు సింగరకొండపైకి తోలుకుని వెళ్ళేది. ఆవులమందలో ఒక ఆవు రోజు తరబడి పాలు ఇచ్చేది కాదు సింగన్న ఆవు గురించి ఆరాతీయటం కోసం ఒకరోజు రహస్యంగా ఆవును వెంబడిస్తాడు. ఆవు కొండపైకి వెళ్ళి ఒక శిలవద్ద ఆగుతుంది. ఆ శిలనుండి ఒక బాలుడు అవతరించి ఆవుపాలు తాగి వెళతాడు. నరసింహస్వామియే ఆ బాలుని రూపంలో వచ్చి పాలు తాగుచున్నాడని విశ్వసించిన సింగన్న ఇక్కడ నరసింహస్వామి ఆలయం నిర్మించాడని ఒక కధనం
.వేరొక కథనం 14వ శతాబ్ధంలో తాతాచార్యులు అనే నరసింహస్వామి భక్తుడు స్వామి వారి ఆదేశం మేరకు ఆలయం నిర్మించాడని చెబుతారు.
సుమారు 210 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధ్వజస్ధంభ ప్రతిష్ట జరుగుతుండగా కొండ దిగువనున్న భవనాశనీ తటాకం ఒడ్డున ఒక తేజోవంతుడైన యోగి శ్రీప్రసన్నాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి అదృశ్వమయ్యాడంటరు. ఈ అద్భుతాన్ని కొండపైనుండి తిలకించిన వేలాదిమంది భక్తులు భక్తిపారవశ్వంతో శ్రీ ప్రసన్నాంజనేయస్వామిని ఆరాధిస్తారు. అప్పటినుండి సింగరకొండ దివ్వక్షేత్రమై విరాజిల్లుతుంది. ఈ క్షేత్రపాలకుడు నరసింహస్వామి.
తిరునాళ్ళ : ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి తిరునాళ్ళ జరుగుతుంది. మరియు హనుమజ్జయంతి వైశాఖ బహుళ దశమి రోజున(మే-జూన్) జరుగుతుంది.
స్వామివారి దర్శనవేళులు : ఉదయం గం.07-00 నుండి మ. గం.12-30 ని.వరకు
మరలా మ.02-00 గంట నుండి రాత్రి గం.07-00 గంట వరకు
వసతి సౌకర్యాలు : దేవస్ధానంవారి వసతి గృహంలో బసచేయవచ్చు. లేక ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒంగోలు పట్టణంలో బసచేయవచ్చు.
ప్రయాణసౌకర్యాలు : ప్రకాశం జిల్లా అద్దంకి మండంలోని సింగరకొండలో ఈ గుడి ఉన్నది. ఒంగోలు పట్టణం నుండి 40 కి.మీ దూరంలో ఉన్నది.ఒంగోలు పట్టణానికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్ల నుండి చేరుకోవచ్చు. ఒంగోలు నుండి బస్సులో వెళ్ళవచ్చు. అద్దంకి మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉన్నది.