header

Mavullamma Talli, Bhimavaram / మావుళ్లమ్మ తల్లి దేవస్థానం

Mavullamma Talli, Bhimavaram / మావుళ్లమ్మ తల్లి దేవస్థానం
మావుళ్లమ్మ తల్లి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం/ గ్రామంలో కలదు.
మహాకాళి అవతారంగా మావుళ్ళమ్మను భావిస్తారు స్ధానికులు . వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా మామిడి తోటలు వుండేవిట. దీనితో ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అని పిలిచేవారంటారు. ఈ చుట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లి అని, మా ఊరి అమ్మని పిలిచేవారంటారు. కాలక్రమేణా మావుళ్ళమ్మ పేరుగా స్థిరపడింది.
ఒకప్పుడు ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 సం.లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ విగ్రహాన్ని ప్రతిష్ఠించటం జరిగింది. విగ్రహము ఇప్పుడు గుడిలో కనిపించేది. అమ్మవారు కరుణారసమూర్తి. నాలుగు చేతులతొ ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది మిగతా అమ్మవార్ల విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది.
నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత సుందరంగా వుండే ఈ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని స్థానిక ప్రజల నమ్మకం ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీ నుంది సుమారు నెలరోజుపాటు వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. మరియు ప్రతి సంవత్సరం శ్రీ అమ్మవారికి జ్యేష్టమాసంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును.(జూన్‌-జులై మాసాలలో) ఈ జాతర సందర్భంగా ప్రముఖ వ్యక్తులకు ఇక్కడ వర్తకులు మరియు దేవస్థానం వారు సన్మానం చేస్తారు. మరుగుపడిపోతున్న మన కళలను పునరుద్ధరించే ఉద్దేశంతో వివిధ రంగాల కళాకారులను పిలిచి వారికి తగిన పారితోషకం ఇచ్చి వారిని ప్రోత్సహిస్తారు. బుర్రకథలు, హరికధలు, సంగీత కచేరీలు పురాణ కధల ప్రదర్శనలు, కంజరి కధలు అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు
దర్శన వేళలు :
ఉదయం గం॥ 05-00 నుండి మధ్యాహ్నం గం॥ 12-00 వరకు
మధ్యాహ్నం గం॥ 01-00 నుండి రాత్రి గం॥ 9-00 వరకు
ఉచిత దర్శనం -ఉచిత ప్రసాదం (పులిహోర)
ఇతర వివరాలకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చును:
సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి
శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం
పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్‌ : 08116 – 239505
ఎలా వెళ్లాలి...? విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ భీమవరానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ.ల లోపే ఈ దేవాలయం వుంటుంది. బస్ స్టాండునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటోలలో గునుపూడి సోమేశ్వరాలయం (పంచారామాలలో ఒకటి), యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయాను చూసి రావచ్చు. ఈ ఆలయాలన్నీ 10 -15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.