Visit
http://www.apcofabrics.com/dharmavaram.html
కోట కొమ్మల పట్టు చీరలకు ఎమ్మిగనూరు పేరు పొందింది. అతి సన్నని దారంతో పట్టుచీరల తయారీలో ఎమ్మిగనూరు చేతేతకారులు అపరబ్రహ్మలుగా పేరుపొందారు.
కోటకొమ్మలు, ఏనుగు, నెమలి ఇతర రకాల డిజైన్లలో చీరెలు నేస్తుంటారు.
ఎమ్మిగనూరు దోమతెరలకు, జంపఖానాలు మంచి గుర్తింపుఉంది. ఇక్కడి చేనేత వస్త్రాలు సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయటం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చీరెలకు డిమాండ్ ఉంది. దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. .
ఇక్కడ ఎక్కువగా దుప్పట్లు, లుంగీలు, కాటన్ చీరలు తయారవుతున్నాయి.
ఇదే ప్రాంతానికి చెందిన మాచాని సోమప్ప ఎమ్మిగనూరు వీవర్స్ కో పరేటివ్ సొసైటీని స్థాపించి అనేక మందికి జీవనోపాధి కల్పించి చేనేతకు సేవచేశారు. ఇందుకు గాను కేంద్రప్రభుత్వం సోమప్పను 1954 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది.
Visit
http://www.apcofabrics.com/dharmavaram.html