Gadwal town, Mandal and a municipality - Mahaboobnagar district -
188 km from Hyderabad
gfor gadwal sarees please visit
http://tsco.co.in/219-gadwal-silk-sarees
గద్వాల్ చీరెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 2008 సం.లో ఈ చీరెలకు పేటెంట్ దక్కింది. గతంలో చేతితో డిజైన్లు వేసేవారు. ప్రస్తుతం కంప్యూటర్ సహాయంతో జాకార్డులతో డిజూన్లు రూపొందిస్తున్నారు. ప్రస్తతం 60 శాతం పైటానీ రకం చీరెలు తయారవుతున్నాయి.
గద్వాల్ చీరలలో కాటన్ ఎనభైశాతం, కొంగు, అంచులలో 20 శాతం సిల్క్ ఉంటుంది. ఈ చీరలు నేసే పద్ధతి మిగతా చీరల కంటే భిన్నంగా కష్టంగా ఉంటుంది. కుట్టు లేదా సిల్క్ అంచులను బట్టి గద్వాల చీరలను కనిపెట్టవచ్చు. బంగారు, రాగిపూత గల దారాలతో చిన్న, పెద్ద, మీడియం, ఒకవైపే ఉండేటట్లు రకరకాలుగా అంచులుంటాయి.
ఈ చీరలు కాస్త బరువుగా ఉంటాయి చీర అంచులలో నెమళ్లు, లతలూ, పూలు చాలా రకాలలో ఉంటాయి. చీర మధ్య మధ్యలో పూలు, బుటాలు ఉంటాయి. సీకో, పట్టు టర్నింగ్, బూటా, బ్రోకెడ్ వంటి చీరలు ప్రత్యేకంగా తయారవుతున్నాయి. ఒకో చీర తయారీకి నెల నుండి మూడునెలల సమయం పడుతుంది. ఖరీదు వెయ్యురూపాల నుండి మొదలవుతాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలకు మొదటగా పోచంపల్లి పంచెను పంపించింది గద్వాల రాజు సీతారం భూపాల్. నలభై సంవంత్సరాలుగా గద్వాల నుంచే స్వామివారికి పట్టు వస్త్రాలు పంపటం ఇప్పటికి ఉంది. సీకో, తస్సర్, కాటన్, సిల్క్ రకాలలో గద్వాల్ చీరలు లభ్యమవుతాయి. గద్వాల్ చీరెలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రసిద్ధి గాంచాయి.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలోని స్త్రీలు ఈ చీరెలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
for gadwal sarees please visit
http://tsco.co.in/219-gadwal-silk-sarees