header

Pochampalli Handloom Sarees / పోచంపల్లి చీరెలు

Pochampalli Handloom Sarees Pochampalli in Nalgonda district is known as Silk City of India. Pochampally is named after the cotton, silk and sico garments. In the ancient time, natural colors from trees and flowers were used for Pochampalli textiles. These were exported to Arab countries. Since Here in the 1970 started weaving pattu sarees . These are made in the tie and die method. This method was the first patent to the international level. Pochampally is one of the eleven types of handlooms in the country. The tie and die method consists of eighteen processes. They do the same in the house until they are weaving cotton, hallucination, designing, and looming on the loom. Most of the sarees are made by the women. .About half a million villagers in Pochampally have been benefited through the handloom work. Pochampally ssarees specializes in the lack of colors. The demand for the Ikkat sarees is high. Pochampally sarees are available between two thousand rupees to fifty thousand rupees. Indira Gandhi, Pratibha Patil wore these sarees. It is great thing, that in the Britain's legislative assembly Pochampally garments are used for decoration.

Pochampalli Handloom Sarees / పోచంపల్లి చీరెలు
నల్గొండ జిల్లాలోని పోచంపల్లిని సిల్క్ సిటి ఆఫ్ ఇండియా అంటారు. కాటన్, పట్టు, సీకో వస్త్రాలకు పోచంపల్లి పేరు పొందింది. నిజాం కాలంలోనే చెట్లు, పూల నుంచి సహజసిద్ధమైన రంగులు తయారు చేసి వస్త్రాలకు వాడేవారు. ఇవి అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. 1970 నుండి ఇక్కడ పట్టచీరలు నేయటం మొదలు పెట్టారు. ఇక్కడ టై అండ్ డై పద్ధతిలో మగ్గాల మీద నేస్తారు. ఈ పద్ధతికి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో పేటెంట్ హక్కు సాధించింది.
దేశంలోని పదకొండు రకాల చేనేతలలో పోచంపల్లి కూడా ఒకటి. టై మరియు డై పద్ధతి అంటే పద్దెనిమిది ప్రక్రియలు ఉంటాయి. నూలు కొనడం, రంగులద్దటం, డిజైన్లు వేయటం, మగ్గంపై నేయటం వరకూ ఇంటిలోని వారే చేస్తారు. ఎక్కువ భాగం ఆడవారే చేస్తారు. ఒక కుటుంబం వారం రోజులు పాటు కష్టపడి పడుగు, పేక దారాలను మగ్గంపై నేస్తే వీటి ద్వారా ఏడు చీరలు తయారు కావటానికి నెలరోజులు పడుతుంది. పోచంపల్లి చుట్టుపక్కల దాదాపు రెండొందల గ్రామాలలో అయిదు లక్షల మంది చేనేత పనుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
రంగులు పోవకపోవటం పోచంపల్లి చీరల ప్రత్యేకత. వీటిలో ఇక్కత్ చీరలకు గిరాకీ ఎక్కువ. పోచంపల్లి చీరలు రెండు వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది. ఇందిరా గాంధీ, ప్రతిభాపాటిల్ ఈ చీరలను ధరించారు. బ్రిటన్ శాసనసభ అలంకరణకు పోచంపల్లి వస్త్రాలను ఉపయోగించటం ఒక విశేషం. .