తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట అంటే గొల్లభామ చీరెలు గుర్తుకు వస్తాయి. ఆదునాతన జాకార్డ మగ్గాలపై ఈ చీరెలు తయారు చేస్తున్నారు.
ఈ చీరె కొంగు, అంచు అలాగే చున్నీలపై రకరలా సైజులలో, రంగులలో గొల్లభామ చిత్రాలను రూపొందిస్తారు. ఈ గొల్ల భామ చీరెలకు చెన్నైలోని రిజిస్టర్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ సంస్థ 2012 సం.లో ప్రత్యెక గుర్తింపు ఇచ్చింది.
విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయ మహిళలు ఎక్కువగా ఈ చీరెలు కొంటున్నారని తెలుస్తుంది.