header

Nidanampati Srilakshmi Ammavaru / నిదానంపాటి శ్రీలక్షీ అమ్మవారి జాతర

Nidanampati Srilakshmi Ammavaru / నిదానంపాటి శ్రీలక్షీ అమ్మవారి జాతర
పార్వతీదేవి అవతారంగా చేప్పే ఆ అమ్మవారికి ప్రత్యేకంగా గుడి ఉండదు. భక్తులు ఎండలోనే ఆమెను దర్శించుకుంటారు. ఆవిడే నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు.గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో కొలువైన ఈ అమ్మవారి తిరునాళ్ళ ఏటా మార్చిలో జరుగుతుంది. ఏటా లక్షలాది మంది భక్తులు వస్తారు.
అడిగొప్పలలో తిరునాళ్లంటే సందడే సందడి... అమ్మవారికి నైవేద్యాలు, పొంగళ్ళు.. ఆ ప్రదేశమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది. భక్తులంతా అక్కడే ప్రసాదం పొంగళ్ళు వండుకుని ప్రసాదం తిని వెళ్లిపోతారు. ఇంటికి తీసుకువెళ్లరు.నిదానంపాటి శ్రీలక్ష్మిఅమ్మవారు అంటే ... సంతానాన్ని సకల సంపదనూ ఇచ్చే తల్లిగా కొలుస్తారు. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్నా ఈ అమ్మ పార్వతీదేవి అవతారమని అంటారు.
స్థలపురాణం : అది ద్వాపర యుగాంతం నాటి సంగతి కైలాసంలో పార్వతీ పరమేశ్వలు కూర్చుని ఉండగా ప్రమథ గణాలు నాట్యం చేస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి నందీశ్వరుణ్ణి చూసి హేళనగా నవ్విందట.అపుడు మహర్షి శిలాదుడు అమ్మా నా కుమారుడుని చూసి ఎందుకు నవ్వుతావు అని ఆమెను ప్రశ్నిస్తాడు. అతడి నాట్యంలో భావమూ తాళమూ ఏమీలేదు అని నవ్వుతూ చెప్పింది పార్వతీదేవి.
అప్పుడు శిలాదుడు పట్టరాని కోపంతో నువ్వు కలియుగంలో భూలోకంలో జన్మిస్తావు. అవివాహితవై నువ్వు గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కొంటావు అని శపించాడు. అప్పుడు పార్వతీ దేవి శాప విమోచన చెప్పమని అడుగుతుంది. నీతోపాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నువ్వు రోజూ దానిని పూజించు నీవొక విచిత్ర గర్భం ధరిస్తావు. నాట్యంలో నంది అసంపూర్ణుడని అన్నావు కబట్టి నీగర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లికాకుండా గర్భవతివి అయ్యావని తెలిసి నీవాళ్ళే నిన్ను కాల్చేస్తారు. అలా నువ్వు మానవరూపాన్ని వదిలి నిదానంపాటి అమ్మవారుగా భక్తులకు కొంగుబంగారం అవుతావు. అని చెప్పాడట.
అన్నదమ్ములే కడతేర్చారు..... అలా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు ఏడువందల ఏళ్ల క్రిందట గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. నలుగురి కుమారులు తరువాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకు ఉన్న పశుసంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి రోజూ ఎవరికీ తెలియకుండా గోశాలకు వెళ్ళి ఆ గోవు చుట్టూ ప్రదక్షణలు చేసి గోపంచతాన్ని తాగేది. ఓ రోజు ఆ కామధేనువుతో ఓ ఆబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజూలాగే గోపంచతాన్ని త్రాగింది. అప్పవరకూ రజస్వల కూడా కాని ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. విషయం తెలిసిన గ్రామస్థలు సూటిపోటి మాటలన్నారు.
వంశగౌరవాన్ని మంటగలిపిని శ్రీలక్ష్మిని చంపేయడమే సమస్యకు పరిష్కారమనుకున్నారు ఆమె అన్నయ్యు. ఓ రోజు తల్లిదండ్రులు లేని సమయంలో ఆమెను పొలానికి పిలిపించి, ప్రత్తి మండె ఎక్కించి నిప్పు పెట్టారు. శ్రీలక్ష్మి మంటలో చిక్కుకోవడంతో ఆమె గర్భంలో ఉన్న కోడెదూడ చనిపోయింది. గోశాలనుండి కామధేనువు కూడా వచ్చి మంటల్లో దూకేసింది. సజీవదహనమైన శ్రీలక్ష్మి శిలగా మారిపోతుంది.
ఓ 11 ఏళ్ళ బాలికను పూని ‘‘ఆదివారం నన్ను కాల్చారు కాబట్టి ప్రతి ఆదివారం పసుపు, కుంకుమలతో నాకు పూజలు చేయాలి. నన్ను చల్లరిచేందుకు పొంగళ్ళు నైవేద్యంగా పెట్టాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు. నన్ను దర్శించుకునే వాళ్లంతా ఎండలోనే ఉండాలి’’ అని చెప్పిందట. పదిజిల్లాలనుండి భక్తులు అమ్మవారు వెలసిన ప్రదేశం చుట్టూ10 అడుగుల మేరస్థలం విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి రాష్ట్రంలోని 10 జిల్లాలనుండి కొన్ని లక్షమంది భక్తులు వస్తుంటారు. వీళ్ళంతా అమ్మవారి సన్నిధిలోనే పొంగళ్ళు చేసి నివేదన చేస్తారు. అమ్మవారి దీక్ష తీసుకునే భక్తులు 40 రోజులు దీక్ష పూర్తి అయ్యాక ఇరుముడి కట్టుకుని కాలినడకన అమ్మ సన్నిధికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం లేనివారు ఒకరాత్రి ఇక్కడే బసచేసి అమ్మను ఆరాధిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడకు వచ్చిన వాహనాలన్నీ అమ్మవారి ఆలయం చుట్టూ ప్రక్షిణ చేసి వేళ్ళాల్సిందే.
ఇప్పటి వరకు 16 కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేవస్థానం వారు చేపట్టారు. ఏటా ఉగాదికి ముందు భారీ ఎత్తున తిరునాళ్ళు నిర్వహిస్తారు.