గంగమ్మ గుడి ప్రకాశం జిల్లా, దేనువుకొండ సరిహద్దు గ్రామమైన గార్లపాడులో ఉన్నది. యాదవుల కులదైవం ఈ అమ్మవారు. ఆదివారం భక్తులు ఎక్కువగా వచ్చి మొక్కుబడులు సమర్పించుకొంటారు. వీరు ప్రతి సంవత్సరం ఏప్రియల్ నెలలో పౌర్ణమి రోజున ఈ అమ్మవారి జాతర చేస్తారు. జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అంకరిస్తారు.
భక్తులు కొరకు ఇక్కడ సత్రం కలదు. రెండు బావులు మరియు బోర్‌వెల్స్ ద్వారా నీటిసౌకర్యం కల్పిస్తున్నారు. ఇంకా ఇక్కడ నాగేంద్రుని గుడి మరియు కొండమీద కట్టబడిన కనకదుర్గమ్మ దేవాలయంను దర్శించవచ్చు.
ప్రయాణ సదుపాయాలు : ప్రకాశం జిల్లాలోని దేనువుకొండ గ్రామానికి 1.5 కి.మీ. మరియు గార్లపాడు గ్రామానికి 1 కి.మీ. దూరంలో గంగమ్మ తల్లి దేవాలయం కలదు.