Gangamma Talli Jatara, Kadapa.. గంగమ్మ తల్లి జాతర కడప జిల్లా. రాజాం మండలం, బలిజేపల్లి గ్రామంలో జరిగే గంగమ్మ జాతరకు షుమారు ఒక లక్షమంది జనం వస్తారు. గ్రామం అంతా బాణాసంచా మరియు మేళతాళాలతో సందడిగా ఉంటుంది. చెన్నై పట్టణం నుండి కుమ్మరులు మట్టితో గంగమ్మ విగ్రహాన్ని తయారు చేసి తీసుకువస్తారు. అమ్మవారికి సింధూరం, పసుపు, పూలు, కొబ్బరికాయలు, అగరు వత్తులు సమర్పించుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ జాతర జరుగుతుంది. కడప జిల్లా అన్ని ప్రాంతాలనుండి ప్రజలు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఈ జాతర చూడటానికి వస్తారు. అమ్మవారికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలి ఇస్తారు. చెట్లక్రింద పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతర సందర్భంగా రాజంపేట వ్యాపారులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు మంచినీరు, కొబ్బరి నీరు, మజ్జిగ ఉచితంగా ఇస్తారు.