

 
 
విశాఖపట్నంలోని బురుజుపేటలో, 30 రోజుల పాటు శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి వార్షిక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి    (మార్గశిరమాసం డిశెంబర్-జనవరి నెలలో)  లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తారు. మంగళవారం మరియు గురువారాలు అమ్మవారికి పర్వదినాలు. ఈ రెండురోజులలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అన్నదాన పధకంలో రోజుకు సుమారు 300 మందికి గురువారం రోజున సుమారు 600 మందికి అన్న సంతర్పణ చేస్తారు. 
 ఉత్సవాలలో హరికధలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేదసభలు జరుగుతాయి. 2013లో ఈ ఉత్సవాలు డిసెంబర్ 3వ తారీకు నుండి జనవరి 1వ తారీకు 2014 వరకు జరుగుతాయి. అన్నదానానికి డొనేషన్స్ ఇవ్వవచ్చు. ఇతర వివరాలకు ఈ క్రింది అడ్రస్‌లో సంప్రదించగలరు 
Deputy Commissioner and Executive Officer
 Sri Kanaka Maha Lakshmi Ammavari Devasthanam Burujupeta, 
 Visakhapatnam. A.P. 
 Ph:0891-2566515, 2568645, 2711725, 2566514 Cell: 9491000651.  
 Email : dc_eo_kanakamahalaxmi@yahoo.co.in