header

Kondapaturu Poleramma Tirunallu / కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్లు

Kolleti Peddintamma / కొల్లేటి పెద్దింటి అమ్మవారు
కొండపాటూరు పోలేరమ్మ గుడి గుంటూరు జల్లా కాకుమాను మండలంలో కలదు.
ఈ అమ్మవారు స్వయంభువుగా చెబుతారు. అమ్మవారికి విశిష్టమైన రోజు మంగళవారం. ఈ రోజు భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకొనుటకు మరియు అమ్మవారి దర్శనంకోసం ఎక్కువగా వస్తారు.
ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు అమ్మవారిని అలంకరించే ముందు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం దేవాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో ఉంది.
జాతర విశేషాలు : ప్రతి సంవత్సరం ఉగాది తరువాత వచ్చే మొదటి శుక్రవారం (ఉగాది పండుగ శుక్రవారం వస్తే అదే రోజున) అమ్మవారి కొలుపు నిర్వహించి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారి జాతర గురించి తెలియజేస్తారు. ఆ రోజు నుండి 19 రోజుల తరువాత వచ్చే మూడవ మంగళవారం నాడు అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగుతుంది.
జాతరలో శిడిమాను ఉత్సవం విశేషమైనది. మేకపోతును పూజించి అమ్మవారిని ఆవహింపచేసి ఆ మేకపోతును ఊసల పెట్టెలో ఉంచి శిడిమానుకు వేలాడదీస్తారు. రైతులు తమ పోలాలో పండిన వరి, మిరప. మొక్కజొన్న కంకులను శిడిమానుకు వేలాడదీస్తారు. అనంతరం శిడిమానును గ్రామ ప్రధాన వీధులలో ఊరేగిస్తారు.
ప్రయాణ సదుపాయాలు
గుంటూరు నుండి వెళ్ళువారు పెదనందిపాడు - కాకుమాను కొండపాటూరుకు వెళ్ళవచ్చు.
చీరాల నుండి వచ్చేవారు : పర్చూరు - పెదనందిపాడు -కాకుమాను -కొండపాటూరుకు వెళ్లవచ్చు.
బాపట్ల నుండి : కాకుమాను - కొండపాటురు
దగ్గరలోని రైల్లే స్టేషన్లు : గుంటూరు.