ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున స్వామివారి తిరునాళ్ళ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. ఎలక్ట్రిక్ ప్రభలకు ప్రసిద్ధి. కొండ మీదకు మెట్ల దారి మరియు ఘాట్‌రోడ్ కలదు.
సాయంత్రం నుండి తెల్లవారు జాము వరకు అనేక రకాల వినోద కార్యక్రమాలు జరుగుతాయి. దుకాణాలతో సందడిగా ఉంటుంది. ప్రభుత్వం వారు ఘాట్‌రోడ్డు నిర్మించడంతో పాటు ఈ క్షేత్రాన్ని సర్యాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శైవ క్షేత్రాలలో ప్రముఖమైనది కోటప్పకొండ
ఎలావెళ్ళాలి : గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట లేక నరసరావుపేటకు వెళ్ళి అక్కడ నుండి ఆర్ టి సి లేక ప్రైవేట్ వాహనాలలో కోటప్పకొండకు వెళ్ళవచ్చు. జాతర సందర్భంగా ఆర్.టి.సి వారు వందల సంఖ్యలో బస్సులు నడుపుతారు.