header

Singarayakonda Lakshmi Narasima Swamy Jatara / శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి, సింగరాయకొండ

Singarayakonda Lakshmi Narasima Swamy Jatara / శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి, సింగరాయకొండ

ఈ పురాతనమైన దేవాలయం ఒంగోలు పట్టణంలోని సింగరాయకొండ గ్రామంలో ఒక కొండ పైన ఉన్నది. సింగం అనగా సింహం మరియు కొండ మీద ఆలయం ఉండటం వలన సింగరాయకొండ అనే పేరు వచ్చిందంటారు.
15వ శతాబ్ధంలో ఈ దేవాలయం నిర్మించబడినది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయం అభివృద్ధి గావించబడినది. శ్రీకృష్ణదేవరాయలచే 5 గ్రామాలు ఈ దేవాలయంనకు ఇవ్వబడినవి. దేవాలయంనకు ముందు ఉన్న గోపురం కూడా శ్రీకృష్ణదేవరాయలచే కట్టించబడినది.
ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తారు. ఈ సింగరాయకొండలోనే ప్రసన్నాంజనేయస్వామి ఆలయం కూడా కలదు. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (పిబ్రవరి నెల) పౌర్ణమి రోజున స్యామివారి ఉత్సవాలు (తిరనాళ్ళు) జరుగుతాయి . మరియు ఇదే ఆలయంలో శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను కూడా దర్శించవచ్చు.
ఎలా వెళ్ళాలి ? : ఒంగోలు పట్టణానికి రోడ్డు మరియు రైలు మార్గాలలో వెళ్ళవచ్చు. అక్కడ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగరాయకొండకు రోడ్డుమార్గంలో వెళ్ళవచ్చు. ఒంగోలు నుండి రైలుమార్గంలో కూడా సింగరాయకొండకు వెళ్ళవచ్చు