మరిడమ్మ తల్లి జాతర జేష్ఠమాసం అమావాస్య (జూన్-జులై) నుండి ఆషాడమాసం అమావాస్య (జులై-ఆగష్టు) వరకు 31 రోజు పాటు వైభవంగా జరుగుతుంది.
చుట్టుపక్కల గ్రామాల నుండి వేలసంఖ్యలో భక్తులు వస్తారు. కోలాటాలు, గరగ నృత్యాలు, ఇతర కళాప్రదర్శనలు ఉంటాయి. జాతర సందర్భంగా గృహ సంబంధమైన అన్ని వస్తువుల దుకాణాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. పశుప్రదర్శన, చిలక సర్కస్, వ్యవసాయ పరికరాల ప్రదర్శనను నిర్వహిస్తారు.
అంకరించిన పాత్రలో ‘‘కుంభం’’ (అమ్మవారి ప్రసాదం) తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.
ఎలా వెళ్ళాలి : రాజమండ్రి నుండి బస్ ద్వారా పెద్దాపురానికి వెళ్ళవచ్చు.