

 
   
ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే  మంగళవారం నాడు ప్రారంభమై శుక్రవారం వరకు 4 రోజుల పాటు అమ్మవారి జాతర వైభవంగా జరుగును. మొదటి రోజు రాత్రి శ్రీ పోలేరమ్మ వారి నిలుపు కార్యక్రమం మరియు నాటకాలు జరుగుతాయి. 
రెండవ రోజు  గ్రామ ఉత్సవం మరియు గొల్ల వేడుకలు. మూడవ రోజు గ్రామ ఉత్సవం, ఉయ్యాలసేవ, నాటకాలు. నాలుగవ రోజు 
శ్రీ పోలేరమ్మ అమ్మవారి వెళ్ళనంపు ఉత్సవం జరుగుతుంది. భక్తులు సౌకర్యం కోసం పొంగళ్ళ షెడ్, వసతి గృహాలు, మహిళలకోసం స్నానపు గదులు కలవు. 
ఎలా వెళ్ళాలి : శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానం, తూర్పు కనుమూరు గ్రామానికి, చిల్లకూరు మండలం, నెల్లూరు జిల్లా. గూడూరు నుండి 35 కి.మీ.,  కోట నుండి 14 కి.మీ. దూరంలో నున్న ఈ దేవాలయానికి ఆర్ టి సి బస్‌లలో వెళ్లవచ్చు.