header

Nokalamma Jatara, Anakapalli / నూకాలమ్మ జాతర-అనకాపల్లి

Nokalamma Jatara, Anakapalli / నూకాలమ్మ జాతర-అనకాపల్లి
అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మ గుడికి 550 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ తల్లినే నూకాంబిక మరియు కాకతాంబ అని కూడా అంటారు. క్రీ॥శ 1450 సం॥లో కళింగరాజు కాకర్లపూడి అప్పరాజుచే అనకాపల్లి కోట మరియు కోటకు దక్షిణం వైపున నూకాలమ్మ గుడిని కట్టించాడు.
ప్రస్తుతం ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో ఉన్నది. ఈ గుడికి 8 కాటేజీలు, కళ్యాణమండపం, క్యూ కాంప్లెక్స్‌ కలవు. నూకాలమ్మ అమ్మవారి గుడి రాత్రి గం॥8-00 కు మూసివేయబడుతుంది.
ఇతర వివరాకుల 08924-225048 నెంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించగరు.
నూకాaమ్మ జాతర : ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య (తెలుగు సంవత్సరాది(ఉగాది)) రోజునుండి నెలరోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా మలేసియా, సింగపూర్‌ నుండి అధికసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. కొత్త అమవాస్య నుండి రెండు మూడు నెలలపాటు అధికసంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. జాతర చివరిరోజు ‘నేలపండుగ’ అనే ఉత్సవాన్ని ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు.
ప్రయాణసదుపాయాలు : నూకాలమ్మ అమ్మవారి గుడి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండం, గవరపాలెం గ్రామంలో ఉన్నది.