header

Palnati Veerla Aradhana.... పల్నాటి వీరుల ఆరాధన, కారంపూడి (మాచెర్ల) గుంటూరు జిల్లా

Palnati Veerla Aradhana పల్నాటి వీరుల ఆరాధన, కారంపూడి (మాచెర్ల) గుంటూరు జిల్లా
దాయాదుల సమరంతో మహాభారత కథతో సమానంగా ప్రాచుర్వం పొందినది పల్నాటి గాధ. పల్నాటి యుద్ధంలో అసువులు బాసిన వీరుల సంస్మరణార్థం వారి ఆయుధాలకు పూజలు నిర్వహించడం వారి పేరుతో ఆరాధనను జరిపించడం ఆచారంగా మారింది.
కార్తీకమాసం (నవంబర్‌ నెల) అమావాస్య నుండి ప్రారంభమై 5 రోజుల పాటు ఈ ఆరాధనలు జరుగుతాయి. సుమారు 800 సంవత్సరాలుగా కారంపూడిలో ఈ వీరుల ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవ వివరాలు : మొదటిరోజు రాచగావు : రాజు ఇచ్చే బలిని (మేకపోతును నోటితో కొరికి చంపడం) రాచగావు అంటారు. 11 జిల్లాలలోని ఆచారవంతులు తమ కొణతాలను తీసుకొని కారంపూడిలోని వీర్లదేవాలయానికి చేరతారు
రెండవరోజు రాయబారం : ఏడేళ్ళ వనవాసనంతరం తిరిగి మాచర్ల రాజ్యం కోసం అలరాజు నలగాముని వద్దకు వెళతాడు. కాని నాగమ్మ కుట్రతో చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆచారవంతులు వీరావేశంతో కత్తిసేవ చేస్తారు.
మూడవరోజు మందపోరు : కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయిన మలిదేవాదులు వద్దనున్న పశుసంపదను నాగమ్మ కుట్రతో అంతమొందించటాని చెంచులతో దాడిచేయిస్తుంది. ఈ దాడిలో లంకన్న అనే వీరుడు మరణిస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా విముక్తిని ప్రసాదిస్తాడు బ్రహ్మనాయుడు.
నాలుగవరోజు కోడిపోరు : అనాడు రెంటచింతల మండలంలోని పాలవాయి వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన కోడిపోరును నేటికి చూపుతారు. నాగమ్మ కుట్రతో బ్రహ్మనాయుడి పుంజు ఓడేటట్లు చేయడం మలిదేవాదులు అడవిపాలు గావటం ఇందులో ముఖ్య ఘట్టం
ఐదవరోజు : కళ్లిపాడు అనే కార్యక్రమంతో ఈ ఆరాధనలు ముగుస్తాయి.
ఎలా వెళ్లాలి ? : గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరు బస్‌స్టాండ్‌ నుండి మరియు నరసరావుపేట పట్టణం నుండి నుండి బస్సులలో కారంపూడికి వెళ్ళవచ్చు.