header

Polamamba Thalli Jatara / శ్రీ పోలమాంబ దేవాలయం

Polamamba Thalli Jatara / శ్రీ పోలమాంబ దేవాలయం
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖపట్నం శివారు పెదవాల్తేరులో వెసిన శ్రీ పోలమాంబ అమ్మవారు. దాదాపు 900 సంవత్సరాల క్రితం విశాఖ సముద్రతీరంలో చేపల వేటకు వెళ్ళిన జాలరులకు పోలమాంబ విగ్రహం వలలో లభ్యమైంది. దాంతో ఈ తల్లిని సముద్ర దేవతగా జాలరిపేటలో నెలకొల్పి ఆరాధించసాగారు. ఆ తరువాత అమ్మవారి ఆదేశం ప్రకారం పెదవాల్తేరులోని కరక్కాయ చెట్టుక్రింద విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆనాటి నుండి ఈ తల్లి కరకచెట్టు పోలమాంబగా పేరుపొందింది. దుర్గాదేవి అవతారంగా పోలమాంబను ఆరాధిస్తారు. అందమైన రాజగోపురం మరియు ఆలయం చూపరుకు ఆధ్యాత్మిక భావనను కలుగ జేస్తుంది. 14 గ్రామాలకు ఆరాధ్యదైవమైన ఈ తల్లిని దర్శించుకోవటానికి ప్రత్యేకించి మంగళ. శుక్రవారాలలో అధికసంఖ్యలో భక్తులు వస్తారు.
తన పరివార దేవతలైన కుంచమాంబ, నీలమాంబ సమేతంగా దర్శనమిస్తుంది. పంటలను రక్షించే ఈ తల్లిని పౌష్యలక్ష్మిగా, పోలాలమ్మగా, పంటలతల్లిగా, వివిధరూపాలో ఆరాధిస్తారు. 14వ శతాబ్ధంలో ఈ ఆలయం నిర్మించబడినది. ఉగాది పండుగ తరువాత వచ్చే మొదటి మంగళవారం నుండి తొమ్మిది రోజుల పాటు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది
దసరా నవరాత్రులు, శ్రావణమాస పూజలు జరుపుతారు. ఇదే ఆలయంలో అనేక ఉపాలయాను చూడవచ్చు. దండుమారెమ్మ తల్లిని కూడా ఇదే ఆలయంలో చూడవచ్చు. మొత్తం ఏడు ఉపాలయాలను చూడవచ్చు. నేస్తాలమ్మకు వైశాఖ పౌర్ణమినాడు విశేష పూజలు జరుపుతారు. ఇంకా సరస్వతీ దేవి ఆలయం, బంగారమ్మ అమ్మవారి ఆలయం, కనకదుర్గమ్మ అమ్మవారు, సత్తెమ్మ తల్లి ఆలయాలను కూడా దర్శించవచ్చు.
ఎలావెళ్ళాలి : విశాఖపట్నం బస్‌స్టేషను లేక రైల్వే స్టేషన్‌ నుండి కేవలం మూడు కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు. విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్ల నుండి రైళ్ళు నడుపబడుచున్నవి.