header

Ratnalamma Tirunala, Ratnalakunta / రాట్నాలమ్మ తిరునాళ్ళ

Ratnalamma Tirunala, Ratnalakunta / రాట్నాలమ్మ తిరునాళ్ళ
రాట్నాలమ్మ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పేదవేగి మండలంలో ఉన్న రాట్నాలకుంట గ్రామంలో పచ్చని చెట్లు, ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతిలో ఉన్నది. ఈ ఆలయం వేంగి చాళుక్యులకాలంలో నిర్మించబడినది.
ఈ అమ్మవారు వేంగి చాళుక్యుల (వీరిని తూర్పు చాళుక్యులు అని కూడా అంటారు) కులదైవం. ప్రతి సంవత్సరం చైత్రమాసం చైత్రశుద్ధ పౌర్ణమి (ఏప్రియల్‌ నెల) నుండి 5 రోజుల పాటు తిరునాళ్ళు మహావైభవంగా జరుగుతుంది.
తిరునాళ్ళ మొదటి రోజున అమ్మవారిని బాలాత్రిపురసుందరీ దేవిగా, రెండవ రోజు ధనలక్ష్మీదేవిగా, మూడవరోజు సరస్వతీ దేవిగా, నాల్గవ రోజు దుర్గాదేవిగా, ఐదవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. నాల్గవ రోజున గ్రామోత్సవం జరుగుతుంది. ఐదవ రోజున అమ్మవారి పేరుమీదుగా అన్నప్రసాదం జరుగుతుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మందిరాన్ని కూడా దర్శించవచ్చు
ఈ తిరునాళ్ళకు ఉభయ గోదావరి జిల్లాల నుండియే కాక కోస్తాంధ్ర జిల్లాల నుండి భక్తులు వేలాదిగా వస్తారు. శుక్రవారం మరియు ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
ఎలావెళ్ళాలి : పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండంలో ఉన్న రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయానికి ఏలూరు నుండి వెళ్ళవచ్చు.