శంబర పోలేరమ్మ ఉత్సవాలు ఏటా జనవరి 2వ వారంలో జరుగుతాయి. విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరలో ఈ గుడి ఉన్నది. ఈ జాతరకు విజయనగరం జిల్లాతో పాటు చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుండి వేలాదిగా భక్తులు వస్తారు.
ఆలయానికి సమీపంలో గోముఖీ నది ప్రవహిస్తుంది. దీనిపై నిర్మించిన వెంగళరాయసాగర్ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందినది. అమ్మవారిని దర్శించుకుని జలాశయం మరియు చుట్టుప్రక్కల కొండకోనలో విహరించవచ్చు.
ఎలావెళ్లాలి : విజయనగరం జిల్లా సాలూరు (20 కి.మీ) మరియు బొబ్బిలి నుండి బస్సులు, ఆటోలలో వెళ్ళవచ్చు.