తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వరప్రసాదినిగా జన్మించి, తిరుపతమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసం(జనవరి-మార్చి) మరియు ఫాల్గుణ మాసం(మార్చి నెలలో) పౌర్ణమి నుండి పెద తిరునాళ్ళ మరియు చిన తిరునాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి.
చినతిరునాళ్ళలో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమ తీసుకు వచ్చి సమర్పిస్తారు. ఆలయం వద్ద ఉన్న 90 అడుగుల ఇనుప ప్రభను తిరునాళ్ళ సందర్భంగా ఆలయం చుట్టూ తిప్పుతారు.
ఎలా వెళ్ళాలి ? : విజయవాడ నుండి ఆర్ టి సి బస్సులలో వెళ్ళవచ్చు. మధిర, ఖమ్మం, జగ్గయ్యపేట నుండి నేరుగా పెనుగంచి ప్రోలుకు బస్ సౌకర్యం కలదు.