

 
వెంగమాంబ శ్రీవేంకటేశ్వరస్వామి యొక్క పరమ భక్తురాలు మరియు కవయుత్రి.చిన్నతనంలో భర్త మరణిస్తాడు. ఈమె తిరుమల చేరి ఆలయానికి ఉత్తరాన తుంబురకోనలో యోగాభ్యాసం చేస్తూ చాలాకాలం గడిపిందని తెలుస్తుంది. 
ఈమె ప్రతిరాత్రి తమ ఇంటి ముందుకు వచ్చే భోగశ్రీనివాసునికి వెండిపళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తుందట. ఈ విషయం 1890లో తూర్పు ఇండియా వారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది. తిరుమలకు ఉత్తరదిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం పాఠశాల) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది.  ప్రతి సంవత్సరం జూన్-జులై నెలలో జేష్ట పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారంతో మొదలై 5 రోజుల పాటు శ్రీ వెంగమాంబ పేరంటాలు తిరునాళ్ళ జరుగుతుంది. 
(మొదటి రోజు నిలుపు, తరువాత గ్రామోత్సవం మరల గ్రామోత్సవం, తరువాత ప్రధానోత్సవం, చివరిరోజు ఎడ్లబండి లాగుడు పందాలు జరుగుతాయి)  ఈ తిరునాళ్ళకు శ్రీకాకుళం, కడప ఆంధ్రప్రదేశ్ మొత్తం నుండి సుమారు  లక్షల మంది భక్తులు వస్తారు.