header

Venkatagiri Poleramma Jathara / వెంకటగిరి పోలేరమ్మ జాతర (వెంకటగిరి పట్టణం, నెల్లూరు జిల్లా)

Venkatagiri Poleramma Jatara / వెంకటగిరి పోలేరమ్మ జాతర (వెంకటగిరి పట్టణం, నెల్లూరు జిల్లా)
వెంకటగిరి పోలేరమ్మ జాతర నెల్లూరు జిల్లా చుట్టు ప్రక్కల జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా వస్తారు. విదేశాలలోని తెలుగు వారు కూడా వస్తారు.
ఏటా వినాయక చవితి తర్వాత వచ్చే మొదట బుధవారం నాడు జాతర ప్రారంభమవుతుంది. మొదటి బుధవారం ప్రధమ చాటు రెండో బుధవారం రెండో చాటు తరువాత వచ్చే బుధవారం, గురువారాలు (వినాయక చవితి తరువాత వచ్చే మూడో బుధవారం మరియు గురువారం) పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తారు.
జాతర చాటు ప్రకటించాక వెంకటగిరి ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు.
జాతర మహోత్సవం రెండు రోజులపాటు సాంప్రదాయకంగా జరుగుతుంది. కుమ్మరివీధిని అమ్మవారి వీధిగా తలుస్తారు. పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా భక్తుల దర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగ వారి వీధికి తీసుకు వస్తారు. అర్ధరాత్రి తరువాత కళ్ళూ, దిష్టిచుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనుక నుండి పెడతారు. ఆ తల్లి ఊగ్రరూపాన్ని సామాన్యులు చూడలేరని నమ్మిక.
బలి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. జంతుబలులు నిషేధం. పొలి కార్యక్రమం ముగిసాక నిమజ్జనోత్సవం. 1714 నాటికే జాతర ఘనంగా జరిగేదనటానికి నిదర్శనాలు ఉన్నాయి. 1919లో గ్రామశక్తి పోలేరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పటి నుండి వేడుకను భారీగా చేయడం ఆనవాయితీగా మారింది.