header

Yellaramma Thalli Jatara, Tanuku / ఎల్లారమ్మ తల్లి జాతర, మండపాక, తణుకు (పశ్చిమగోదావరి జిల్లా)

Yellaramma Talli Jatara, Tanuku / ఎల్లారమ్మ తల్లి జాతర, మండపాక, తణుకు (పశ్చిమగోదావరి జిల్లా)
ఎల్లారమ్మ తల్లి జాతర చైత్రమాసం (చైత్రమాసం ఏప్రియల్‌-మే నెలలో వస్తుంది) చైత్రపౌర్ణమి రోజున అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎల్లారమ్మ కాకతీయ వంశపు కులదేవతైన కాకతమ్మకు సన్నిహితురాలు.
ఈ తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. కుడిప్రక్క చేతులలో ఢమురుకం, కత్తి ఎడమప్రక్క చేతులలో పానపాత్రలుంటాయి. ఎల్లారమ్మ గుళ్ళు ఆంధ్రప్రదేశ్‌ అంతటా కానవస్తాయి. గరగ నృత్యం ఇక్కడ ప్రత్యేకత.
ఎలా వెళ్ళాలి : తాడేపల్లి గూడెంనకు 19 కి.మీ. దూరం.. ఏలూరుకు 75 కి.మీ దూరం
రాజమండ్రి నుండి 57 కి.మీ దూరం. విజయవాడ నుండి రైలు లేక రోడ్డు మార్గాలలో తణుకు వెళ్ళవచ్చు.
విజయవాడ నుండి చెన్నై - కలకత్తా నేషనల్‌ హైవే రోడ్డుమార్గంలో తణుకులో దిగవచ్చు.అక్కడ నుండి సుమారు 4 కి.మీ దూరంలో మండపాక గ్రామం కలదు.