చంపావతి నది ఉత్తకోస్తాంద్రలోని చిన్ననది. తూర్పు కనుమలోని ఆండ్ర గ్రామంలో 1200 మీటర్ల ఎత్తులో జన్మించి కోనాడ గ్రామం (పశుపతిరేగ మండలం, విజయనగరం జిల్లా) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది విజయనగరం జిల్లాలో గజపతి నగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడపాలెం మరియు నాతవస గ్రామాలనుంచి ప్రవహిస్తుంది. ఈ నదికి ఏడువంపుల గెడ్డ, చిట్టిగడ్డ, పోతుగడ్డ మరియు గాడిగడ్డు ఉపనదులు.
నాగావళి నది ఒరిస్సా రాష్ట్రంలోని కహంది జిల్లాలోని తూర్పుకనుమలలో ప్రారంభమవుతుంది. నది మొత్తం పొడవు 256 కి.మీటర్లు. అందులో 161 కి.మీ. ఒరిస్సా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. 2 కి.మీ. ఒరిస్సా ఆంధ్రా సరిహద్దులో, 93 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది.విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో నాగావళినది ప్రవహిస్తుంది.
నాగావళి నది మీద తోటపల్లి మరియు నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించబడినవి. నాగావళి నది శ్రీకాకుళం పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఉన్న కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
.
శ్రీకాకుళం జిల్లా, బజ్రా మండంలో నాగావళి నదిపై నారాయణపురం గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మించబడినది. మరియు విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, తోటపల్లి గ్రామం వద్ద ఇంకొక ప్రాజెక్ట్ నిర్మించబడుచున్నది.
బర్హ, బల్దియా, సత్నాలియా, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగడ్డ, సువర్ణముఖి,రెల్లిగడ్డ, వేదావతి నాగావళికి ఉపనదులు.
ఈ నది కృష్ణా నది యొక్క భాగం. పామూరు జిల్లా,(మహబూబ్ నగర్) కవలకుర్తి మండంల, రఘుపతిపేట గ్రామం గుండా ప్రవహిస్తుంది.
ఈ నది జన్మస్ధానం చిత్తూరు జిల్లా. బహుదా మరియు పుంచా నదుల కలయిక వలన ఏర్పడ్డది. ఈ రెండు నదులు కడప జిల్లా రాయవరం గ్రామం వద్ద కలుస్తాయి. అక్కడ నుండి 87 కి.మీ. వరకు ప్రవహించి పెన్నా నదిలో కలుస్తుంది. గుంజనా నది చెయ్యేరు నదికి ఉపనది.
బహుదా నది : ఈ నది జన్మస్థానం చిత్తూరు జిల్లాలోని హార్స్‌లీ హిల్స్. వాయల్పాడు గుండా ప్రవహించి కడప జిల్లాలో ప్రవేశిస్తుంది. కడప జిల్లాలోనే పెన్నానదిలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి పొందిన వినాయకుని దేవాయలయం ఉన్న కాణిపాకం గ్రామం ఈ నది ఒడ్డునే ఉన్నది.
మానేరుగోదావరి నది ఉపనది. ఈ నదిమీద కట్టబడిన డామ్ కరీంనగర్‌కు త్రాగునీటిని మరియు రామగుండం ధర్మల్ ప్రాజెక్ట్‌కు నీటిని అందించుచున్నది.
ఈ నది నెల్లూరు జిల్లాలో ప్రవహిస్తుంది. పెన్నానదిలో కలుస్తుంది. విజయనగర రాజు కాలంలో ఈ నదిమీద 1.37 కి.మీ పొడవైన అనంతరాజ్ సాగర్ డామ్‌ను నిర్మించారు
రాయసీమలోని కుందు నది పెన్నా నదికి ఉపనది. కర్నూలు జిల్లా, ఉర్వకల్లు మండలం, ఉప్పలపాడు ఈ నదియొక్క జన్మస్ధానం. కడప జిల్లా ఆదినిమ్మయపల్లి గ్రామం వద్ద పెన్నానదిలో కలుస్తుంది.పూర్వ కాలంలో ఈ నదిని కుముదవతి అని పిలిచేవారు.
ఈ నది మూలకంగా నంద్యాల మరియు కోయిల్‌కుంట్ల ప్రాంతాలు తరచుగా వరదకు గురవుతున్నాయి. ఈ నది వర్షాకాంలో ముఖ్యంగా తుఫాను సమయంలో చాలా ఊగ్రంగా ఉంటుంది.
తూర్పుగోదావరి జిల్లాలోని ఈ నది గౌతమి నదియొక్క ఉపనది గౌతమి నది ఉపనది ఆత్రేయ నదికి ఉపనది.
గుండ్లకమ్మ : ఈ నది కేవల వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది. జన్మస్థానం తూర్పుకనుమలోని నల్లమల కొండలు. అర్ధవీడు, ప్రకాశం జిల్లాలలో నుండి ప్రవహిస్తుంది.
కొండమీద నుండి వచ్చే అనేక కాలువలను కలుపుకొని కంబంలో ప్రవేసిస్తుంది. తరువాత మార్కాపురం మరియు కోరమండలం తీరం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నల్లమల పర్వతాలలో పుట్టే నదులలో గుండ్లకమ్మ పెద్ద నది. గజపతులు కాలంలో ఈ నదిమీద మట్టితో డామ్ నిర్మించబడినది. దీనినే కంబం డామ్ అని పిలుస్తారు.
ఈ నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో పుట్టి విశాఖపట్నంలోని బొర్రా గుహల మీదుగా ప్రవహిస్తుంది. 120 కి.మీ. మేర ప్రవహించి విశాఖపట్నంలోని భీమునిపట్నం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. విజయనగరం మరియు విశాఖపట్నంనకు ప్రధానమైన త్రాగు నీటి వనరు.విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం వద్ద గోస్తని నదిమీద తాటిపూడి రిజర్వాయర్ 1963-68లో నిర్మించబడినది.
పెన్నా నది (పెన్నార్, పెన్నేరు) కర్నాటక రాష్ట్రంలో (చికబల్లాపూర్ జిల్లా) కోలార్ సమీపంలో నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండలో పుట్టి నంది శ్రేణులగుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం నుండి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. అక్కడనుండి నెల్లురు జిల్లాలో ప్రవేశించి నెల్లూరుకు ఈశాన్యంగా ఉన్న ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా నది మొత్తం పొడవు 597 కి.మీ.
శబరి గోదావరి నది యొక్క ముఖ్య ఉపనది. ఒరిస్సా రాష్ట్రంలో పుట్టి చత్తీస్‌గడ్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి పశ్చిమగోదావరి, కూనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది
శారదా నది విశాఖపట్నంలోని మధ్యతరగతి నది. బిజ్జకొండ, లింగాలకొండ (అనకాపల్లి) దనాదిబ్బ(గోకివాడ అటవీప్రాంతం) బౌద్ధ మత చిహ్నాలు ఈ నది ఎడమప్రక్కనే ఉన్నాయి. పశ్చిమ కనుమల నుండి తూర్పుకు 122 కి.మీ మేర ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
శబరి నదికి ఉపనది. మాచ్‌కుంద్ అనికూడా ఈ నదిని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకనుమమలో పుట్టి ఒరిస్సా సరిహద్దుగుండా ప్రవహిస్తుంది. ఒరిస్సా సరిహద్ధులో జాలాపుట్ రిజర్వాయర్ ఈ నదిమీద కట్టబడినది. తరువాత ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘర్, ఒరిస్సా సరిహద్దులలో శబరినదిలో కలుస్తుంది
ఈ నది జన్మస్థానం కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని నందిహిల్స్. చిత్తూరు, కడప, అనంతపూర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. కడప జిల్లాలోని కమలాపురం మండలం వద్ద పెన్నానదిలో కలుస్తుంది.
ఈ నది జన్మస్థానం కర్నాటక రాష్ట్రం, కోలార్ జల్లాలోని నంది హిల్స్. కర్నాటకలలో 93 కిలోమీటర్ల మేర ప్రవహించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 33 కి.మీ మేరకు ప్రవహించి తరువాత తమిళనాడులో ప్రవేసిస్తుంది.
తమిళనాడులో ఈ నది పొడవు 222 కి. మీ.చెన్నై పట్టణానికి 100 కి.మీ దూరంలో ఉన్న వాయూర్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని గణేశ్‌పురం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారిచే కట్టబడుచున్న వ్యవసాయ ప్రాజెక్ట్ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదాకు దారి తీసింది.
వెలికొండలోని డొక్కశ ఈ నది జన్మస్థానం. మార్కాపూర్, దర్శి, పొదిలి, కొండేపి, కోరు ఉప్పపాడు, కొత్తపట్నం మండలాల గుండా ప్రవహించి కొత్తపట్నంలోని మదనూరు మండలం దగ్గర బంగాళాఖాతంలో కుస్తుంది.
పుత్తూరులోని వెలికొండ జన్మస్థానం.నెల్లూరు, తిరువల్లూరు జిల్లాల గుండా 100 కి.మీ. మేర ప్రవహించి బకింగ్‌హామ్ కాలువలో కలిసి తరువాత ఎన్నూర్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది
వంశధారా నది జన్మస్ధానం ఒరిస్సాలోని నియమగిరి పర్వతపానువు. నది మొత్తం పొడవు 230 కి.మీ. 150 కి.మీ. ఒరిస్సాలో ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
వంశధారా నది శ్రీకాకుళం జిల్లాకు ప్రధాన నీటివనరు. శ్రీకాకుళం జిల్లాలో గొట్టాల వద్ద ఈ నదిమీద ఆనకట్ట నిర్మించబడినది.
స్వర్ణముఖీ నది జన్మస్ధానం తిరుపతి చంద్రగిరి మధ్యవున్న తొండవాడ సమీపంలోని కొండప్రాంతం. ఈ నది జీవనది కాదు. అక్టోబర్ నుండి డిసెంబర్ దాకా మాత్రమే ప్రవహిస్తుంది.
ఈ నది భీమానది, కళ్యాణి నదులలో కలిసిపోయి తొండవాడలో త్రివేణిసంగమంగా మారి ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తుంది.
ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఈ నదీతీరంలోనే ఉన్నది.