భారతదేశంలోని గంగ, సింధునది తరువాత అతి పెద్ద నది గోదావరి. ఈ నది జన్మస్థానం మహారాష్ట్రలోని నాశిక్ దగ్గర త్రయంబకేశ్వరం వద్ద అరేబియా సముద్రానికి 80 కి.మీ దూరంలో ఉన్నది. మహారాష్ట్రలో నుంచి తెంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా, బాసర వద్ద ప్రవేశిస్తుంది. ఆ తరువాత నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం గుండా ప్రవహించి తరువాత తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలలో ప్రవహించి పశ్ఛిమ గోదావరి, నర్సాపూర్ దగ్గరలో బంగాళాఖాతంలో కలుస్తుంది. .
రాజమండ్రి, ధవళేశ్వరం నుండి ఈ నదిని గౌతమిగా పిలుస్తారు. ధవళేశ్వరం వద్ద ఈ నది ఏడుపాయలుగా చీలుతుంది. ఇవి గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్వప. ఇందులో గౌతమి, వశిష్ట, వైనతేయు మాత్రమే ప్రవహించే నదులు మిగిలినవి అంతర్వాహినులు. గోదావరి నది పొడవు 1450 కి.మీ.
నది పుట్టుక కథనం : ఒకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి నీటికి, తిండికి కరువు ఏర్పడిన పరిస్థితులో గౌతమమహాముని తన తపోశక్తితో పంటలు పండించి తోటిమునులకు నీరు, ఆహారం సమకూరేలా చేస్తాడు. గౌతముని తపోశక్తికి అసూయ చెందిన తోటిమునులు ఒక మాయాగోవును సృష్టించి పంటపొలంలోకి పంపిస్తారు. గౌతముడు ఒక దర్భపుల్లతో ఆ గోవును అదిలించగా అది మరణిస్తుంది. .
గౌతమ మహాముని గోహత్యాపాతకం నుండి విముక్తికోసం పరమశివుని గురించి తపస్సుచేసి గంగను భూమిమీదకు రప్పిస్తాడు. ఆ గంగయే గోదావరి మరియు గౌతమిగా పిలువబడుతుంది. గోదావరి నదిని చనిపోయిన గోవుమీదగా ప్రవహింపచేసి గోహత్యాపాతకం నుండి విముక్తుడవుతాడు గౌతముడు. ఆ క్షేత్రమే గోష్పాద క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. పశ్చిమగోదావరి జిల్లా, రాజమండ్రిలోని కొవ్వూరు పట్టణంలో గోష్పాద క్షేత్రం ఉంది. .
గోదావరి ఉపనదులు : వైన్‌గంగా, పెన్‌గంగా, వార్ధానది, మంజీరా, ఇంద్రావతి, బిందుసార,శబరి, ప్రవర, పూర్ణానది, ప్రాణహిత, సీలేరు, కిన్నెరసాని, మానేరు.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదీతీరాన ఉన్న కొన్ని ముఖ్యపట్టణాలు : తెంగాణాలో బాసర, నిర్మల్ (ఆదిలాబాద్) భట్టాపూర్ (నిజామాబాద్ ఆర్మూర్ టాయ్స్) భద్రాచలం (ఖమ్మం) ధర్మపురి, కాళేశ్వరం (కరీంనగర్) గోదావరి ఖని, మంధని (కరీంనగర్`గౌతమేశ్వరస్వామి ఆలయం), ఏటూరునాగారం (వరంగల్) .
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పరివాహక ప్రాంతాలు : .
తూర్పుగోదావరిలో : దేవిపట్నం, సీతానగరం, రాజమండ్రి, ఆత్రేయపురం రావుపాలెం, ఎ గన్నవరం, రాజోలు, మాల్కిపురం, సఖినేటిపల్లి, కోటపల్లి,తాళ్లపూడి, నర్సాపూర్ .
పశ్ఛిమ గోదావరి : పోలవరం,తాళ్ళపూడి,,కొవ్వూరు,నిడదవోలు,పెరవలి,పెనుగొండ,యలమంచిలి,నర్సాపూర్.
తెంగాణాలో : ఇబ్రహింపట్నం, మల్లాపూర్, రాయకల్, సారంగపూర్, ధర్మపురి, వెల్లటూర్, రామగుండం, మంథని, మహదేవపూర్ మీదుగా ప్రవహిస్తుంది. .
ఆదిలాబాద్ : ముదోల్ (బాసర శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయం) లొహెడ, దిల్లావర్‌పూర్, నిర్మల్, మామిండ, ఘన్‌పూర్, కడం, జన్నారం, దండేపల్లి,లక్సెట్టిపేట, మంచిర్యాల, జైపూర్, నిన్నెల్ మండలాల మీదుగా ప్రవహిస్తుంది. .
ఖమ్మం : వాజేడు, బెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం,వర రామచంద్రాపురం.
పినపాక, చణుగూరు, అశ్వాపురం, కూర్గ్‌పహాడ్, కుక్కునూరు, వేలేరుపాడు.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు : బాసర సరస్వతీ దేవాలయం (ఆదిలాబాద్) కోటిలింగాలు, మంతని, కాళేశ్వరం, ధర్మపురి, ముక్తేశ్వరం-కరీంనగర్, భద్రాచలం, ఖమ్మం పట్టిసీమ, ప.గోదావరి కొవ్వూరు, ప॥గోదావరి , మందపల్లి -తూ.గోదావరి, కోటిపల్లి - రాజమండ్రి అంతర్వేది (తూ.గోదావరి) శ్రీబాబాలాజీ దేవాలయం-అప్పనపల్లి, తూ.గోదావరి.
గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు: .
శ్రీరాంసాగర్, శ్రీపాద, ధవళేశ్వరం-రాజమండ్రి. దుమ్ముగూడెం బ్యారేజ్ - ఖమ్మం జిల్లా.