కృష్ణానది జన్మస్థానం పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలో (జార్ గ్రామం నుండి వెయ్ తాలూకా, సతారా జిల్లా) మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వతశ్రేణిలో చిన్న ధారగా జన్మించి అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్నాటక తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి దివిసీమలోని హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1400 కి.మీ. ఈ నదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని నదులో 4వ పెద్దనది.
మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ నది కొయునా, వర్ణ, పంచగంగ, దూద్‌గంగ నదులను తనలో కలుపుకుంటుంది. మహారాష్ట్రలో కృష్ణానది మొత్తం 360 కి.మీ. ప్రవహిస్తుంది. తరువాత కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటలోకి ప్రవేశిస్తుంది. కర్నాటకలో ఘటప్రభ మాలప్రభ నదులు కృష్ణానదిలో కలుస్తాయి. కర్నాటకలో మొత్తం 482 కి.మీ. మేర ప్రవహిస్తుంది.
కర్ణాటకలో ఆల్‌మట్టి మరియు నారాయణ్‌పూర్‌లో కృష్ణా నదికి ఆనకట్టలు నిర్మించారు. కర్నాటకలో కృష్ణానది ప్రవహించే చివరి ప్రదేశం రాయచూర్ జిల్లా, దేవర్‌సుగుర్ గ్రామం. తరువాత ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన తెంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెంగాణాలోకి ప్రవహిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా రావులపల్లి వద్ద ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించారు.
తరువాత ఆలంపూర్ దగ్గర తుంగభద్రానది కృష్ణానదిలో కలుస్తుంది. ఆలంపూర్ నుండి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేసిస్తుంది. తరువాత నల్లమల కొండలలో లోతైన లోయలోకి ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూులో శ్రీశైలం వద్ద మరియు గుంటూరు జిల్లా నాగార్జునా సాగర్ వద్ద పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడినవి.ఆంధ్రప్రదేశ్‌లో మూసి, దిండి, పాలేరు, మున్నేరు చిన్ననదులు కృష్ణా నదిలో కలుస్తాయి.
విజయవాడ వద్ద బ్రీటీష్ వారి కాలంలో నిర్మించబడిన ప్రకాశం బ్యారేజ్ నుండి డెల్టా ప్రాంతంలో ప్రవేశించి కృష్ణా జిల్లాలోని పులిగడ్డవద్ద రెండు పాయుగా చీలిపోయి కుడిపాయ నాగాయంక వైపు ఏడమపాయ దివిసీమలోని కోడూరు మండలం, హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
కృష్ణా నదీతీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలు
ఆలంపూర్ జోగులాంబా దేవాయలయం :మహబూబ్ నగర్, ఆలంపూర్‌లో ఉన్న జోగులాంబా దేవాలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. (ఇక్కడ తుంగభద్రానది కృష్ణా నదిలో కలుస్తుంది)
శ్రీశైలం : కర్నూలు జిల్లాలో కృష్ణా నదీతీరంలో శ్రీశైలం కొండలలో ఉన్నదీ సుప్రసిద్ధ శివాలయం. ఇది కూడా అష్టాదశ శక్తీపీఠాలలో ఒకటి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలో ఒకటి.
అమరావతి : సుప్రసిద్ధ ఈ శైవ క్షేత్రం గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది. పంచారామాలో ఇది ఒకటి.
దుర్గామల్లేశ్వర స్వామి (కనకదుర్గ ఆలయం): కృష్ణా జిల్లా, విజయవాడలో కృష్ణా నది పక్కన ఉంటుంది ఈ ఆలయం.
శ్రీకాకుళం : చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో శ్రీకాకుళాంద్ర మహావిష్ణు ఆలయం మరియు శివాలయం కలవు. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచన ఇక్కడే ప్రారంభించాడు. . శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని కూడా ఇక్కడే చూడవచ్చు.
శ్రీక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేదాద్రి, జగ్గయ్యపేట : పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాయం జగ్గయ్యపేటలో వేదాద్రి గ్రామంలో ఉన్నది.
కృష్ణాజిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న పట్టణాలు, గ్రామాలు :
జగ్గయ్యపేట,చందర్లపాడు, కంచికచెర్ల, ఇబ్రహీంపట్నం,గొల్లపూడి విజయవాడ, కంకిపాడు, తొట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటశాల, చర్లపల్లి, అవనిగడ్డ, నాగాయంక
గుంటూరు జిల్లా : వెల్దుర్తి, మాచెర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, మాచవరం, బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి, తుళ్ళూరు, తాడేపల్లి, కొల్లూరు
కర్నూలు : కొసగి, మంత్రాలయం, నందవరం, సిబెగాల్, కర్నూలు
నల్గొండ : కృష్ణా (యేలేశ్వరం,దేవరకొండ తాలూకా) నల్గొండలో 85 కి.మీ. ప్రవహిస్తుంది.
కృష్ణా నదీతీరంలోని ఉన్న దేవాలయల పూర్తి సమాచారం ఈ క్రింది website చూడవచ్చు.
ఈ దేవాలయ పూర్తి వివరాలు ఈ క్రింది website లో చూడవచ్చు.
www.telugukiranam.com