telugu kiranam

Tungabadhra River, River Tungabhadra / తుంగభద్ర నది

Tungabadhra River, River Tungabhadra / తుంగభద్ర నది
తుంగభద్ర కృష్ణానదికి ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడ్డది. ఈ నది జన్మస్థం కర్నాటకలోని పడమటి కనుమలు. తుంగ, భద్ర అనే రెండు నదులుగా ప్రవహిస్తూ కర్నాటకాలోని షిమోగా జిల్లా కూడ్లీ వద్ద రెండునదులు కలసి తుంగభద్రగా పేరుపొందింది. అక్కడనుండి కర్నాటకలోని శృంగేరీపీఠం, హంపీ మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లా, కౌతాం మండలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
కర్నూలుజిల్లా మంత్రాలయం గుండా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసి పోతుంది. తుంగభద్రా నది ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లోని ఆలంపూర్‌కు దగ్గరలోని గొండిమల్ల వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహబూబ్‌నగర్‌ మరియు కర్నూలు ఈ రెండు జిల్లాలలో మాత్రమే ప్రవహిస్తుంది.
చారిత్రకంగా ఈ నది ప్రసిద్ధి పొందినది. చరిత్ర ప్రసిద్ధిపొందిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే ఉన్నది. హంపి, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డునే వెలశాయి. మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా పేరుపొందిన జోగులాంబా దేవాలయం (మహబూబ్‌నగర్‌, ఆలంపూర్‌ గ్రామం) కూడా ఈ నది ఒడ్డునే ఉన్నది. భారతదేశంలోని పంచగంగలలో ఒకటిగా తుంగభద్రను పెద్దలు పిలుస్తారు.
కర్నూలు లోని సుంకేశుల గ్రామం వద్ద ఈ నదిమీద బ్యారేజ్‌ (ఈ బ్యారేజ్‌నే ప్రస్తుతం కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రాజెక్ట్‌ గా పిలుస్తున్నారు) కట్టబడినది