telugu kiranam

Timmamma Marry Manu / తిమ్మమ్మ మర్రి మాను

Timmamma Marry Manu / తిమ్మమ్మ మర్రి మాను

Timmamma Marry Manu / తిమ్మమ్మ మర్రి మాను
అనంతపురం జిల్లా ఎన్పీకుంట మండలం గూటిబైలులో ఉందీ భారీ వృక్షం. వయసు 660 ఏళ్లకు పైమాటే. 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమాను కిందికి వెళ్తే.. ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఊడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరి, భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిముషాల్లా గడిచిపోతాయి. క్రీ॥శీ॥ 1355లో పతిభక్తి పరాయణురాలైన తిమ్మమాంబ నాటిన ఎండిన మర్రికొమ్మే నేటి ప్రపంచ మర్రిచెట్టుగా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది.
1990 నుంచి తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణ బాధ్యతలను అటవీశాఖ చేపట్టింది. ప్రజల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చెట్టు ఊడలు పాడవకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు. అంతేకాదు మర్రిమాను విస్తరించిన 8.5 ఎకరాల చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. యాత్రికులు నడిచేందుకు కాలిబాట నిర్మించారు. మర్రిమాను పరిసరాల్లో పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం కూడా ఉంది. వన్యప్రాణుల షెడ్డు నిర్మించి పావురాలు, నెమళ్లు, కుందేళ్లను సాకుతున్నారు. యాత్రికుల బస కోసం పర్యాటక శాఖ అతిథి గృహాన్ని కూడా నిర్మించింది. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ చెట్టుక్రింది తిమ్మమ్మ గుడిని చూడవచ్చు.
ఎలా వెళ్ళాలి
అనంతపురం నుండి కదిరి మీదుగా 120 కి.మీ. దూరంలో ఉంటుంది. కదిరికి 35 కి.మీ. దూరంలో ఉన్న గూటిబైలు గ్రామంలో తిమ్మమ్మ మర్రి చెట్టు ఉన్నది.

Timmamma Marry Manu
A huge remarkable banyan tree called as Timmamma Mari Manu located in Anantapur. Branches of this banyan tree spread over 5 acres. It is believed this tree has 550 years old. This biggest tree was recorded in Guinness book in the year 1989.
A tiny temple dedicated to Timmamma lies under this tree.
On Shivaratri festival a big jatara was conducted here and thousands of people will come and worship Timmamma diety.
How to go?
Timmamma marri manu is 35 kms distance away from Kadiri (Ananatapur dist) town and 100 kms from Anantapur town.