వీరాపురంలో 188 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన చెరువు ఉంది. దీని కింద 80 ఎకరాల ఆయకట్టుంది. దీని చుట్టూ వందలాది చెట్లుండటంతో ఎన్నో ఏళ్లుగా సైబీరియా నుంచి వేలాది కొంగ జాతి పక్షుల వలస వస్తున్నాయి. వీటిని స్థానికుంలతా ప్రేమగా ఎర్రమూతి కొంగలంటారు. ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం మొదవుతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ ఇవి వీరాపురానికి వచ్చి ఇక్కడే సంతాన కార్యం పూర్తి చేసుకుని, ఆగస్టు తరువాత తిరిగి పిల్లలతో సహా వెళ్లిపోతాయి.
ఈ కాలంలో ఇవి స్థానిక చెరువులోని చేపలతో పాటు ఆహారం కోసం చుట్టుపక్కల కొన్ని వంద కిలోమీటర్లు వెళ్లి తిరిగి సాయంత్రం సమయానికి తిరిగొస్తాయి. కొన్ని ఏళ్లుగా ఇవి గ్రామంతో మమేకమైపోయాయి. దీంతో గ్రామంలోని కొన్ని కుటుంబాల వారు వీటి కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించి మరీ వేస్తున్నారు.
సీజన్‌లో పక్షులను చూసేందుకు వచ్చే పర్యాటకుతో ఈ ఊరొక మినీ పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఈ చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు క్రింద 86 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నీటితో సాగుచేస్తే చెరువులో నీరు తగ్గిపోయి మత్ససంపద అంతరించి ఎక్కడ పక్షులు రాకుండా పోతాయోనన్న సృహతో గ్రామస్తులు ఈ చెరువు నీటితో సాగును నిలిపివేశారు.
Veerapuram a tiny and remote village in Anantapuram dist is famous for bird sanctuary . This sanctuary is located at the border of Andhra Pradesh and Karnataka.
The painted storks migratory birds that flies thousands of miles from Siberia. There is a 188 acres ancient pond is in Veerapuram village. Hundred of trees are here surrounding the pond.
These birds are nested only on the trees. Villagers protected these birds and take care of the birds by not harming by anybody.
Large nets are tied under the trees to safeguard the eggs from falling onto the road.
Best season to visit veerapuram bird’s sanctuary from February to August.