మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే బెస్తవారు (చేపలు పట్టేవారు) ఉండే చిన్న గ్రామం మంగినపూడి. ఇక్కడ బీచ్ లోతు తక్కువగా ఉంటుంది. బీచ్ ఒడ్డున ఉన్న నాట్యశాలలో విద్యార్థలకు కూచినపూడి నృత్యం నేర్పిస్తారు. ఒడ్డునే దత్తాశ్రమము, పురాతన శివాలయం కలవు. ఈ బీచ్లోనే లింగాకారంలో ఉండే 12 బావులు కలవు. ఒకక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు. ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతంగా గడపటానికి అనువైన వాతావరణం కలిగి ఉన్నది.
కార్తీక పౌర్ణమికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బీచ్ ఒడ్డనే పార్కు కలదు.
ఈ బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు. విజయవాడ నుండి మచిలీపట్నానికి బస్ లేదా రైలు మార్గంలో వెళ్ళవచ్చు.