శ్రీకాకుళంలో కళింగపట్నం బీచ్ పేరుపొందిన పర్యాటక ప్రదేశం. ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే సముద్రతీర ప్రాంతం. ఇక్కడ లైట్ హౌస్ బౌద్ధ స్థూపం కూడా ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్న పురాతనమైన మరియు ప్రశాంతమైన బీచ్. (రేవుపట్నం) అప్పట్లో ఇక్కడనుండి సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. వంశధార నది సముద్రంలో కలిసే చోటు కూడా ఇది. వారాంతపు సెలవులు గడపటానికి ఆహ్లాదకరమైన ప్రదేశం. బ్రిటీష్ వారి కాలంలో రేవుపట్టణం మూసివేయబడినది. బీచ్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, ఈతకు అనుకూలం. వసతి సౌకర్యం : టూరిజం వారి రిసార్ట్స్ మరియు ఇతర కాటేజ్ లలో బస చేయవచ్చు. ఎలా వెళ్ళాలి : కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాలో మండల కేంద్రం మరియు పంచాయితీ. శ్రీకాకుళానికి 30 కి.మీ. దూరంలో ఉంటుంది. బస్సులు తక్కువగా ఉంటాయి. శ్రీకాకుళం నుండి రోడ్ మార్గం ఉంది
శ్రీకాకుళం, సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు బీచ్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ (నిర్మాణం పూర్తికాలేదు) పర్యాటకులు సెదతీరేందుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రతీరంలోని జీడిచెట్లు, మామిడి చెట్లు కనువిందు చేస్తాయి.
శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరంలో ఉన్న కవిటి బీచ్ జీడిమామిడి, కొబ్బరి తోటలతో కనువిందుగా కోనసీమను గుర్తుకు తెస్తుంది. ఈ కవిటినే ఉద్ధానం అనికూడా పిలుస్తారు. పనస, ఇతర పండ్లతోటలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కవిటి గ్రామంలో శ్రీచింతామణి అమ్మవారు మరియు శ్రీసీతారామస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందినవి
విశాలమైన ఇసుకతిన్నెలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. సముద్రస్నానానికి అనువైన ప్రదేశం. కనుచూపు మేర ఇసుకతిన్నెలతో వెన్నెలలో పిండారబోసినట్లు ఉంటుంది. మహాంద్రతనయ నది సంగమ ప్రాంతం కూడా. ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్తీకమాసంలో సముద్ర స్నానాలకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతిరోజు సాయంత్రం చుట్టుప్రక్కల ప్రజలు, పర్యాటకులతో సందడిగా ఉంటుంది. బారువలో జనార్థనస్వామి, కోటీలింగేశ్వరస్వామి, జగన్నాథ స్వామితో పాటు ఇంకా అనేక ఆలయాలున్నాయి.