ఏటి కొప్పాక, విశాఖపట్నం జిల్లా, ఎలమంచిలి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము వరహ నది ఒడ్డున ఉండుటచే ఏటీకొప్పాక అనే పేరు వచ్చింది. ఇది లక్కబొమ్మల తయారుకు ప్రసిద్ధి గాంచినది. ఏటి కొప్పాక బొమ్మలంటేనే ఓ తిరుగులేని బ్రాండ్. ఏటికొప్పాక కళాకారుల సృజనాత్మక శక్తికి తిరుగులేదు. ఈ బొమ్మలకు సహజమైన రంగులు వేస్తారు. ఈ రంగులు పూలు, చెట్ల బెరడులు నుండి తయారు చేస్తారు. ఏటికొప్పాక బొమ్మ చేయటమంటే ఓ జీవికి ప్రాణం పోసినంతపని, ఎందుకంటే ప్రతి బొమ్మనీ విడిగా తయారు చేయవలసిందే. మూసపోసి చేయటానికి వీలు లేదు. చుట్టుపక్కల ఉండే అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు.
చెవిదుద్దులు, గాజులు, షార్క్ చేపనుండి తిమింగలాలు వరకు, గోడలకు వేలాడదీసే అలంకరణలు, గోడగడియారాలు, అలంకరణ వస్తులు ఇంకా ఎన్నో వస్తువులను ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తారు.
ఈ గ్రామపు ఇద్దరు వ్యక్తులకు బొమ్మల తయారీలో రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది.
సీ.వీ రాజుకు సహజ రంగులు తయారు చేసినందుకు, శ్రీశైలపు చిన్నయాచారికి లక్కబొమ్మల తయారుకు రాష్ట్రపతి అవార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్ద్స్ 2010 సంవత్సరంలో లభించింది