నిర్మల్ బొమ్మలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. ఈ బొమ్మలను నిర్మల్ కళాకారులు చాలా శ్రద్ధ, ఏకాగ్రతతో తయారు చేస్తారు. ప్రతి బొమ్మను శ్రద్ధగా తయారు చేయవలసిందే. మూసపోసి చేయటానికి వీలులేదు. అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. వీటికి వేసే రంగులు కూడా సహజమైనవే. వీటిని కళాకారులే చెట్ల ఆకులు, బెరడులు, కూరగాయలనుండి స్వయంగా తయారు చేసుకుంటారు. నిర్మల్ బొమ్మలకు 400 సంవత్సరాల చరిత్ర కలదు. నిర్మల్ తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.