చిత్తూరు జిల్లాలో తిరుపతికి దగ్గరలో చంద్రగిరిలో ఉన్న చంద్రగిరి కోట ఒకటప్పటి విజయనగర రాజధానిగా భావించబడుచున్నది. మరియు అరవీడు వంశంవారికి సంబంధించినది. ఈ కోట వేయు సంవత్సరా క్రితం కట్టబడి క్రమక్రమంగా అభివృద్ధి చేయబడినది.
చంద్రగిరికోట 183 మీటర్ల ఎత్తున్న కొండమీద దక్షిణం ప్రక్కన బలమైన గోడలతో మరియు శత్రువు కోటలో ప్రవేశించకుండా చుట్టూ కందకంతో నిర్మించబడినది. కోట క్రింది భాగంలో రెండు అంతస్తులుంటాయి. క్రింది అంతస్తు రాతితోను పైన అంతస్తు ఇటుకతోనూ నిర్మించబడినది. దీనిలో ప్రధానమైనది రాజ్‌మహల్. చంద్రగిరి కోటకు తూర్పున చంద్రగిరి పట్టణం కలదు.
చంద్రగిరి ప్రాముఖ్యతను వివరించే శబ్ధ మరియు లైట్ ప్రదర్శన ఏర్పాటు చేయబడినది. వివరాలు
మెదటి ప్రదర్శన :
తెలుగులో : నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు : సాయంత్రం గం06-30 ని.నుండి 07-15 ని.వరకు
మార్చి నుండి అక్టోబర్ వరకు : రాత్రి గం.07-00 నుండి గం. 07-45 ని.వరకు
రెండవ ప్రదర్శన :
ఇంగ్లీష్‌లో : నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు : సాయంత్రం రాత్రి గం.07-30 నుండి 08-15 ని.వరకు
మార్చి నుండి అక్టోబర్ వరకు : రాత్రి గం.08-00 నుండి గం.08-45 ని.వరకు
కోట చూడటానికి ప్రవేశరుసుము చెల్లించవలసి ఉంటుంది.
ఎలా వెళ్లాలి?.... : తిరుపతి నుండి 12 కి.మీ. దూరంలో ఉన్న చంద్రగిరి కోటకు బస్సులో లేక సొంతవాహనాలలో వెళ్ళవచ్చు.