class="justi">
Gurramkonda Fort…గుర్రంకొండ కోట
గుర్రంకొండ కోట మదనపల్లి నుండి 29 కి.మీ. దూరంలో మదనపల్లి`రాయచోటి`కడప రోడ్డుమార్గంలో కలదు. మరియు వాయల్పాడు నుండి 12 కి.మీ. దూరంలో కలదు. అప్పట్లో టిప్పూ సుల్తాన్ వారసులచే ఈ కోట కట్టబడి వారి ఏలుబడిలో ఉండేది. కొండమీద కట్టబడిన ఈ కోటకు గుర్రాల మీద వెళ్లేవారు. అందు చేతనే ఈ కోటకు గుర్రంకొండ అనేపేరు వచ్చింది. ఈ కోట చరిత్రపరంగా నిర్మాణపరంగా ప్రాధాన్యత సంతరించుకొన్నది. రాగిణి మహల్ మరియు మాక్బ్రా సమాధిని ఇక్కడ చూడవచ్చు.