చిత్తూరు జిల్లాలోని పుత్తూరు దగ్గర ఉన్న కైలాసకోన అసలు పేరు కైలాసనాథ కోన’.
కొండల పైనుంచి జాలువారే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఎత్తయిన కొండల పైనుంచి రకరకాల ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ దాదాపు 100 అడుగుల పైనుంచి దూకే ఈ జలపాతం నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఈ నీటిలో స్నానం చేస్తే పలు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న నమ్మకం ఉంది.
వసతి: ఏపీ టూరిజం హరిత హోటల్‌లో పర్యాటకులు బస చెయ్యవచ్చు. నాన్ ఏసీ, డీలక్స్ గదులు అందుబాటులో ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి .....
తిరుపతి నుండి 45 కిలోమీటర్లు...... చెన్నై నుండి 100 కిలోమీటర్ల దూరంలో కైలాసకోన ఉంది. తిరుపతి నుండి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు.