శ్రీ వేంకటేశ్వరా జూ పార్క్ (జంతుప్రదర్శనశాల) సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
సింహాలను దగ్గరగా చూసేందుకు లయన్ సఫారీ సౌకర్యం ఉంది.
చెంగుచెంగున ఎగురుతూ సందడి చేసే లేళ్ళు మరియు దుప్పులను.. డీర్ సఫారీలో చూడొచ్చు. జంతువులు పక్షులు మాత్రమేగాక ఈ జంతు ప్రదర్శనశాల అరుదైన వృక్షసంపద, పుష్ప సంపదకు నిలయం.
విద్యార్థులలో జంతువుల పట్ల, ప్రకృతి పట్ల అవగాహన పెంచేందుకు ఇక్కడ ‘బయోస్కోప్’ పేరిట ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. జూ సమీపంలోనే సైన్స్ సెంటర్ ఉంది. సందర్శకుల కోసం మంచినీటి సౌకర్యం, కేంటిన్, టాయ్ లెట్, పార్కింగ్ సౌకర్యం కలదు.
పార్కు సమయాలు : వేసవికాలంలో ఉదయం గం.8-30 ని. నుండి సాయంత్రంగం.5-30 ని.లవరకు
సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు : ఉదయం గం.9-00 నుండి సాయంత్రం గం.5-00 ల వరకు. ప్రతి మంగళవారం జూ మూసివేయబడుతుంది.
తిరుపతికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్వీ జూ పార్క్ ఉంది. బస్సులు ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లవచ్చు.