మారేడుమిల్లికి 10 కి.మీ. దూరంలో ఉన్న మరొక పర్యాటక ప్రాంతం పాములేరు. పాములేరు వాగు చెంతకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. కార్తీకమాసంలో ఈ ప్రాంతం సందర్శకులతో సందడిగా ఉంటుంది. వనసంరక్షణ సమితివారు ఇక్కడ కేంప్ ఏర్పాటుచేసి 20 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి వారికి ఒక గుడారం ఏర్పాటు చేస్తారు. క్యాంప్ ఫైర్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక రాత్రి గడపవచ్చు.
Pamuleru, a small water stream is another picnic spot which is 10 km distance from Maredumilli. In Karthikamas (November) this places is crowded with visitors. Camp fire and tents for at least 20 members will be arranged for visitors to stay here for one night.