బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారతదేశంలోనే అతి పొడవైన గృహలుగా పేరుగాంచినవి.
మేఘాలయగుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగాభావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత . బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది.
ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరి నుండి బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. గుహల్లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నయి.
బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన చాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. బెలూం గుహల్లోని క్రీ.పూ. 4500 నాటి పాత్రల అవశేషాలు చూస్తే, వాటి పురాతనత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను ' స్టాలక్ టైట్ 'లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతోంది.
చదునైన వ్యవసాయ భూమికింద కలవు. బయటనుండి 3 బావులవలె ప్రవేశద్వారాలుంటాయి.
మధ్యదారి నుండి ప్రవేశించాలి,
బెలూం గుహలు కర్నూలుకు 100 కి.మీ. దూరంలో కలవు..నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు,జమ్మలమడుగుకు 75 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ప్రవేశరుసుము : పెద్దలకు రూ.40/-
పిల్లలకురూ.20/-
Belgam caves 5 km away to Kolimigundala mandal in Kurnool district. They are known as the longest caves in India. These caves are formed naturally in the underground of agricultural lands.
These are the second largest caves after Meghalaya caves. The caves are the most unique natural ancient caves. Local and foreign tourists will visit these caves . Long tunnels, rock plagues, and all the awesome wonders of the these caves attracts tourists.
As per the experts opinion Belgam caves formed over 10 million years ago.
These caves are spread over 10 km in the underground. Since February 2002, people have been allowed to visit the belgam caves.
Since then, the Andhra Pradesh Tourism Development Corporation has developed these caves and surrounding areas. In 1985 the state government acquired the belgam caves.
In 1999, the state tourism development authorities was paved a road with cement and slab stones up to 1.5 km for tourists. An artificial pool and fountain arranged in the caves with this, the caves became more and more beautiful.
Balloon caves are longer than the Borra caves in Visakhapatnam district. These include long routes, spacious chambers, and fresh water galleries.
Belum caves are 100 kms from Kurnool. It is 70 km away from Nandhyala. 35 km from Thadipatri and 75 km from Jammal Madugu
Entrance Fee:
Admission: Rs.40 / - for adults
Rs. 20 / - for children