అనంతపురంలోని గూటి, పురాతనమైన కోటలు గల చిన్నపట్టణం. గూటి కోట 300 మీ. ఎత్తులో ఉన్న మంచి పర్యాటక ప్రదేశం, గూటి కోట విజయనగర రాజులచే కట్టించబడినది.తరువాత మరాఠాలు, మురారి నేతృత్వంలో ఈ కోటను ఆక్రమించుకొన్నారు. తరువాత 1773లో హైదర్ ఆలీ ఈ కోటను మరాఠీలనుండి వశపర్చుకున్నాడు.
కొండమీదకు కాలి నడకనే వెళ్లాలి. మొదట విశాలమైన మైదానం కనిపిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే.. వ్యాయామశాల, ఆయుధ గిడ్డంగి, సైనికుల కవాతు మైదానం, అశ్వ, గజశాలలు, వంట గది, నేల మాళిగలు ఆనాటి వైభవాన్ని చాటుతాయి. కోటపైకి ఎక్కే కొద్ది కన్పించే 101 బావులు రాజుల ముందుచూపును తెలియజేస్తాయి.
1799లో టిప్పూ సుల్తాన్ కింద వున్న ఈ కోటను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. ఈ కోట నత్త ఆకారంలో నిర్మించబడి 15 ఋజువులతో 15 ప్రధాన ద్వారాలు కలిగియున్నది. ఎత్తులో ఉన్న కోటకు మంచినీటి సౌకర్యం కల్పించటం ఆనాటి సాంకేతిక నైపుణ్యానికి ఒక మచ్చ తునక.
విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబులు, టిప్పుసుల్తాన్ ఇలా అనేక మంది గుత్తికోటను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వర్తించారు. పాలెగాళ్ల కాలంలో సుమారు 1000 మంది కూలీలతో ఈ కోటను మరింత పటిష్టపరిచారని చరిత్రకారులు చెబుతున్నారు.
గుత్తి కోట గురించి చెప్పిన తొలి శాసనాలన్నీ కన్నడ, సంస్కృత భాషల్లో లిఖించారు. వీటిల్లో ఈ కోట పేరు అని, బుక్కరాయల శాసనంలో రాజదుర్గం అని ప్రస్తావించారు. ఆంగ్లేయులు గుత్తి కేంద్రంగా దత్త మండలాలను పాలించారని చెబుతుంటారు.
ఈ కొండ చుట్టూ 16 కి.మీ. పొడవునా రాతి గోడలు శంఖు ఆకృతిలో కన్పిస్తుంటాయి. నత్తగుల్ల, శంఖం, గవ్వ ఆకారంలో కన్పించే ఈ కోట గోడ అయిదు మీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కోటకు 15 బురుజులు, 15 ప్రధాన ముఖ ద్వారాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. ఇక్కడి కొండలు దూరం నుంచి పుష్పాల గుత్తిలా కనిపించడంతో ఈ ఊరికి గుత్తి అన్న పేరు స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. ఆవరణలో రెండు శాసనాలు, వ్యాయామశాల, మురారిరావు గద్దె ఉన్నాయి. మురారిరావు గద్దె నెక్కితే గుత్తి మొత్తం కన్పిస్తుంది. ఈ కోటను ఎర్రకోట కంటే పెద్దదని, గోల్కొండ కంటే విశాలమైనదని చెబుతారు. అపురూప కట్టడాలు, అద్భుతమైన శిల్ప కళ, రాణివాసాలు, బావులు.. కారాగారాలు.. విడిది గృహాలు కనులవిందు చేస్తాయి
ఇక్కడున్న ధాన్యాగారంలో రెండేళ్లకు సరిపడా ధాన్యం నిల్వ ఉంచేవారట. కరవొచ్చినా, ఏదైనా యుద్ధం వచ్చినా.. కొంతకాలం కోట ద్వారాలు మూసినా.. ధాన్యానికి కొరత ఉండేది కాదట.
ప్రయాణ సౌకర్యాలు : కర్నూలు నుంచి 95 కి.మీ. దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. మెట్లెక్కి కోటపైకి చేరుకోవాలి. ఈ కోట అనంతపురానికి 52 కి.మీ. దూరంలో కర్నూలు-బెంగుళూరు ట్రంక్ రోడ్లో ఉన్నది. అనంతపురం నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా గూటికి వెళ్ళవచ్చు.
Gooty is a small town of Anantapur having oldest forts. The castle is 300 meter height. The fort is a well-known tourist spot, the fort was built by the Vijayanagara kings. Later, the fort was captured by the Marathas in the leadership of Murari. Later in 1773, Hyder Ali conquered the fort from Marathis.
Again this fort was occupied by the Britishers when this is under Tippu Sultan in 1799. The fort has a 15 entrance gates with 15 towers built in the shape of a snail. To provide a fresh water facility for this fort resembles technical skills of those days.
Gooti Fort 52 km to Anantapur at Kurnool-Bangalore Trunk Road from Anantapur, the place can be reached by road and rail.