header

Guttikonda Caves


Guttikonda caves / గుత్తికొండ గృహలు

గుత్తికొండ గృహలు గుంటూరు జిల్లాలోని నర్సరావుపట్టణానికి 28 కి.మీ. దూరంలో కారంపూడి గ్రామానికి దగ్గరలో దట్టమైన అడవులలో వున్న ప్రకృతి సహజమైన గృహలు ఇవి. ఇది పుణ్యక్షేత్రము కూడా 13వ శతాబ్దంనాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉన్నది ఈ పుణ్యక్షేత్రం. క్రీ.శ 1754వ సంవత్సరంలో స్వయంప్రకాశఅవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణకాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడు.
అలనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం పురావస్తువారి అన్వేషణలో లభించగా దానిని హైదరాబాదు పురావస్తుశాలలో పదిలపరిచారు. బిలంలో 101 సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్ళు జరుగుతుంది. కార్తీకమాసంలో జిల్లా నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలి వచ్చి, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
ఈ బిలం ప్రకతి సహజ సిద్దంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామిని దర్శిస్తారు. తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ జలాలు ఎక్కడనుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు.
ఇక్కడ జలాలు ఎప్పడు ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి. ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు జరిగే బిలమహొత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ బిలానికి మరో ప్రత్యేకత ఉంది ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. నూటొక్క సొరంగాలున్న ప్రాంతం, రహస్యాలకు కేంద్రబిందువుగా ఉంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలు ఉన్నాయి.పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం
ఎలా వెళ్లాలి : హైదరాబాద్ నుండి వచ్చేవారు మాచెర్ల నుండి, గుంటూరు నుండి వచ్చేవారు నర్సరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తరువాత అక్కడ అందుబాటులో ఉంటే ఆటో మాట్లాడుకొని ఈ బిలానికి చేరుకోవాలి. ఆటో లేకపోతే 5 కి.మీ. నడక తప్పదు. ఆదివారాలు, సెలవు రోజులు, పర్వదినాలలో వెళ్లటం మంచిది. పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Guttikonda caves
Guttikonda caves (Guttikonda Bilam) are 28 km far away from Narsaraopet town in Guntur district. This natural and historical caves are in the dense forests near Karampudi village.
This pilgrimage site is also a symbol of the Indian culture of the 13th century. In the year 1754 AD, the Swyam Prakasa Avadoota Swamy was erected a Sivalingam which is called as Dark Mallaiah.
After completion of famous Pulnati war Brahma Naidu entered into this caves and spent his last days here peacefully.
The weapon used by Brahmanaidu, was found in archeological exploration and was kept it in archaeological museum at Hyderabad.
This cave consists of 101 tunnels. Each tunnel leads to individual waters. Devotees make baths in the water. Every year, the first Ekadasi will be celebrated on the occasion of Tirunalla. Devotees come from all over the district in the Kartikamasam and come here to celebrate the beauty of the temple and perform special poojas for the darkness.
This crater is formed in a natural process. It has many interior caves and marvelous reservoirs. There are 101 tunnels in the bilam, and only seven are suitable for use currently in the caves. Water is very pure in the bin in the bow.
Devotees worships firstly Cheekati Mallaiah goes to Brahmana crater, Reunaka Mata crater. Pilgrims perform the rituals in these caves. The devotees believe that bathing in the waters of the river would be a bath in the Ganga in Kashi. Nobody knows where the waters go and from where they come.
The devotee believes that there are routes to Amaravati, Srisailam, Kashi, Chejerla, Ahohibalam etc. A large number of devotees migrate to the Bila Mahostavam which is celebrated every year at Ashada Sudda Ekadasi.
There is another specialty for this water, that is warm in winter and cool in the summer season. Balamalleswara Swamy, Raja Rajeswara Swamy and Vinayaka temples are at the mouth of this crater.
How to get: The caves are located around 3 km south of the Guttikonda village. From Guttikonda village autos are available to reach Guttikonda caves. Buses are available to Guttikonda from Narasaraopet and Guntur towns