header

Kondapalli Fort / కొండపల్లి కోట

Kondapalli Fort / కొండపల్లి కోట
కొండపల్లి కోట కృష్ణా జిల్లా, విజయవాడకు సమీపంలో కొండపల్లి గ్రామంలో ఉన్న కోట. ఈ కోటను క్రీ.శ 1360 లో కొండవీడు రాజ్యాన్ని పరిపాలించిన రెడ్డిరాజులు నిర్మించారు. ఎత్తైన ఋజువులతో, గోడలతో శతృదుర్భేధ్యంగా నిర్మించారు. ప్రధాన ద్వారాన్ని దర్గా దర్వాజా అంటారు. ఈ కోట 18 చదరపు కి.మీటర్లలో విస్తరించి యున్నది. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో తనీషా మహల్, పర్షియన్ సన్యాసి దర్గా, రాణిమహల్, ఏనుగులను ఉంచే గజశాల ఇంకా శిధిలావస్థలో ఉన్న అనేక శిధిలాలను చూడవచ్చు. తర్వాత శతాబ్దాలలో ఇందులో తరచూ ఉత్తర, దక్షిణాది రాజుల మధ్యన, ఆంగ్లేయుల మధ్యన యుద్ధాలు జరిగాయి. ముందుగా ఈ కోటను ఒరిస్సా రాజులైన గజపతులు ఆక్రమించారు. తరువాత ఈ కోట1520 సంవత్సరంలో విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల స్వాథీనమైనది. 1541 లో ఈ కోటను మహమ్మదీయులు ఆక్రమించారు. తరువాత బ్రిటీష్ వారి ఆధీనమైనది. బ్రీటీష్ వారు తమ సైనికులకు ఈ కోటలో శిక్షణ ఇచ్చేవారు. కొండపల్లి కోటకు దగ్గరలో ఉన్న గ్రామంలో తయారయ్యే బొమ్మలు అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందినవి. ఈ బొమ్మలను స్థానికులు పూర్తిగా చేతితో చేస్తారు. దీనికోసం స్థానికంగా లభించే పొనికి అనే చెక్కను వాడతారు. వీటికి వేసే రంగులు కూడా సహజమైనవి. ఈరంగులను కూడా వీరే తయారుచేసుకుంటారు. వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందిన బొమ్మలు ఏనుగు అంబారి, తాటిచెట్టు, పక్షులు, పండ్లు, శ్రీకృష్ణుడు, గోపికలు, ఇంకా పురాణాలకు సంబంధించినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపల్లి గ్రామం నుంచి కోట వరకూ రోప్ వే, ఫుడ్ కోర్టులు తదితరాలు నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మెగా టూరిజం సర్క్యూట్‌లో కొండపల్లికి స్థానం లభించింది.కొండపల్లి - ఇబ్రహీంపట్నం - భవానీ ద్వీపం - మచిలీపట్నం - దివిసీమ ప్రాంతాలను భాగం చేస్తూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలావెళ్లాలి
విజయవాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విజయవాడ – హైద్రాబాద్ దారిలో ఇబ్రహింపట్నం అడ్డరోడ్డుకు దగ్గరలో కలదు

Kondapalli Fort
Kondapalli Fort is in the village of Kondapalli near Vijayawada, Krishna district. This fort was constructed by Reddirajulu who ruled Kondavedu kingdom in 1360 AD.
The fort, which has a very picturesque sight, with tall towers, the walls are built with sharpness. The main route is called Dargah Darwaza. The fort is spread over 18 square kilometers. The valuable sculptures of this fort are preserved at the State Museum of Hyderabad.
One of the major attractions here is the Tanisha Mahal, the Persian monastery Dargah, Rani Mahal, andh elephants yard.
In later centuries, there were often wars between the northern and southern kings and the Britisher’s. Earlier the fort was occupied by the Orissa kings of Gajapati’s. Later the fort was captured in 1520 AD by Vijayanagara King Srikrishna Deva Rayalu.
Again this fort was captured by the Muslim ruers in 1541. Subsequently, the British occupied this fort. Kondapalli toys made in the village near the Kondapalli Fort are internationally famous. These toys are made entirely by locals with poniki wood. Colors applied to Kondapalli toys are natural.
Kondapalli is already in the center of the mega tourism circuit. Kondapalli - Ibrahimatnam - Bhavani Island - Machilipatnam - Divisima areas are part of the tourism circuit development.
How to go ?
Vijayawada is about 20 km away to this fort. From Ibrahimatnam ring rod this fort is about 5 km.