header

Kondaveedu Fort

Kondaveedu Fort / కొండవీటి కోట
కొండవీడు గుంటూరు పట్టణానికి 25 కి.మీ.దూరంలో ఉంది. 10వ శతాబ్దంలో రెడ్డిరాజులచే కొండలమీద నిర్మించబడిన కొట ఇది ప్రస్తుతం కోట శిధిలాలను మాత్రమే చూడవచ్చు. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది.
కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేతికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.ఘాట్‌రోడ్డు కొత్తపాలెం వైపు నుంచి
ట్రెక్కింగ్ కు అనుకూలం. కొండమీదకు మెట్లదారిగుండా నడచి వెళ్ళాలి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొండమీదకు రోడ్డు వేయటానికి ప్రయత్నాలు జరుగుచున్నవి.
ఎలావెళ్ళాలి : గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్ళేదారిలో బోయపాలెం దగ్గరనుండి కుడివైపు రోడ్డు కొండవీడు గ్రామానికి వెళతుంది. అక్కడ నుండి కోటమీదకు వెళ్లవచ్చు. గుంటూరు నుండి షుమారు 25 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరుకు రైలు, రోడ్డు మార్గాలద్వారా చేరుకోవచ్చు. ఒంగోలు (దక్షిణం నుండి వచ్చేవారు) ప్రాంతంమీదుగా వచ్చేవారు బోయపాలెం దగ్గరనుండి ఎడమవైపు రోడ్డుకు తిరిగి కొండవీడుకు వెళ్లవచ్చు.

Kondaveedu fort
Kondavedu is 25 km away from Guntur town. It was built in the 10th century by the Reddirajulu and is now only the ruins are there. There are three ponds the Mutyalama Cheruvu, the Puttalamma Cheruvu and the Vedulla Cheruvu are on the mountain. If one pond fills with rainy water, excess water flow into another pond without waste of water.
At the foot of hill Venugopalaswamy temple is there. There are a lot of sculptures on the walls of the temple walls inside and outside. There is 5 square km flat land is available to use on the hill.
There are several monuments that have historical monuments, 44 bastions, 32 mile ramparts, two granaries, 5 temples, horses, arsenal, natikot, mosque and treasury. from Suitable for trekking. Walk down the stairs on the hill. This area is currently being developed. There are attempts to drive on the hill.
How to get: From Guntur to Chilaluripettu, the road to the right from Boyapalem goes to Kondavidu village. From there you can go to the castle. It is about 25 km away from Guntur. Guntur can be reached via rail and road. Ongole (from the South) are those who come to the area from Boyapalem to the left and back to Kondavedu.
How to go : Kondapalli Fort is 25 km from Guntur Town and 16 km from Chilakaluripet. (from Guntur- take right turn at Boypalem – Kondaveedu). From chilakaluripet – take left turn at Boyapalem-Kondaveedu)